Fire Accident: రెస్టారెంట్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 17 మంది మృతి

Fire Accident: రెస్టారెంట్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 17 మంది మృతి
X
Fire Accident: బీజింగ్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటల్లో చిక్కుకుని 17 మంది కస్టమర్లు కాలిబూడిదయ్యారు.

Fire Accident: బీజింగ్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటల్లో చిక్కుకుని 17 మంది కస్టమర్లు కాలిబూడిదయ్యారు. ఈ ఘోర అగ్నిప్రమాదం చైనాలోని ఈశాన్య నగరం చాంగ్‌చున్‌లో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించి ఆస్పత్రికి తరలించారు సిబ్బంది.

అక్రమ నిర్మాణాలు, నిబంధనల ఉల్లంఘనల కారణాలతో చైనాలో తరచుగా ఘోర అగ్నిప్రమాదాలు సంభవిస్తుంటాయి. కొద్ది రోజుల క్రితం చైనా టెలికాం కంపెనీకి సంబంధించిన ఓ ఆఫీస్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం చైనా టెలికం కంపెనీకి చెందిన ఓ ఆఫీస్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఆ సమయంలో ఎవరూ లేకపోవడం వల్ల భారీ ప్రాణ నష్టం తప్పింది. గత ఏడాది జులైలో ఓ గోదాంలో జరిగిన ప్రమాదంలో 15 మంది మరణించారు, 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Tags

Next Story