Dubai: దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం.. నలుగురు భారతీయులు మృతి

Dubai: దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం.. నలుగురు భారతీయులు మృతి
X
Dubai: దుబాయ్‌లోని అల్ రాస్ ప్రాంతంలోని ఓ భవనంలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది.

Dubai: దుబాయ్‌లోని అల్ రాస్ ప్రాంతంలోని ఓ భవనంలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘోర ప్రమాదంలో 16 మంది మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన వారిలో ఇద్దరు కేరళీయులు కూడా ఉన్నారు. మృతులను మలప్పురంలోని వెంగరకు చెందిన 38 ఏళ్ల రిజేష్, అతని భార్య జేషి (32)గా గుర్తించారు. కేరళకు చెందిన దంపతులే కాకుండా ఇద్దరు తమిళనాడు వాసులు కూడా అగ్నిప్రమాదంలో మరణించినట్లు నివేదికలు ధృవీకరించాయి. మృతులు పాకిస్థాన్, నైజీరియా, సూడాన్‌లకు చెందిన వారని సమాచారం. ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు. ఐదంతస్తుల భవనంలోని నాలుగో అంతస్తులో శనివారం మధ్యాహ్నం 12.35 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. అగ్నిప్రమాదం తరువాత ఒక విండో ఏసీ పగిలిపోవడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. రిజేష్, అతని భార్య ఉన్న గదికి మంటలు వ్యాపించడంతో ఊపిరాడక మృతి చెందారు. రిజేష్ డ్రీమ్‌లైన్ ట్రావెల్స్ అండ్ టూరిజంలో పనిచేస్తుండగా, జెషి దుబాయ్‌లోని క్రెసెంట్ స్కూల్‌లో టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. జీవనాధారం కోసం వేరే దేశం వెళ్లి అక్కడ అగ్నిప్రమాదానికి బలి కావడం కుటుంబసభ్యులను తీవ్రంగా కలిచివేసింది

Tags

Next Story