అంతర్జాతీయం

షేక్స్పియర్ 36 నాటకాలు.. రూ.73 కోట్లు

సాహిత్యానికి సంబంధించిన ఏ ఒక్క రచనా ఇప్పటి వరకు ఇంత భారీ ధర పలకలేదని క్రిస్టీస్ చెబుతోంది.

షేక్స్పియర్ 36 నాటకాలు.. రూ.73 కోట్లు
X

విలియం షేక్స్పియర్ యొక్క 36 నాటకాలను కలిగి ఉన్న మొదటి ఫోలియో తొలిసారిగా బుధవారం వేలంలో రికార్డు స్థాయిలో 9.97 మిలియన్ డాలర్ల(రూ.73 కోట్లు)కు అమ్ముడైందని న్యూయార్క్‌లోని వేలం కంపెనీ క్రిస్టీస్ వెల్లడించింది. ఈ పుస్తకం 1623లో ముద్రించబడింది. అయితే కొనుగోలు దారు వివరాలను గోప్యంగా ఉంచింది సంస్థ. సాహిత్యానికి సంబంధించిన ఏ ఒక్క రచనా ఇప్పటి వరకు ఇంత భారీ ధర పలకలేదని క్రిస్టీస్ చెబుతోంది.

"కామెడీస్, హిస్టరీస్ అండ్ ట్రాజెడీస్" ఇంగ్లీష్ నాటక రచయిత, కవి అయిన షేక్ప్సియర్ మరణించిన ఏడు సంవత్సరాల తరువాత స్నేహితులు ఈ పుస్తకాన్ని సంకలనం చేశారు. ఇంతకుముందు ప్రచురించని 18 నాటకాలు ఇందులో ఉన్నాయి, వాటిలో "మక్‌బెత్" మరియు "జూలియస్ సీజర్" ఉన్నాయి.ఈ పుస్తకాన్ని కాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌లోని ప్రైవేట్ లిబరల్ ఆర్ట్స్ కళాశాల మిల్స్ వేలం వేసింది. కాగా ఈ పుస్తకంలోని 18 నాటకాలు ఇప్పటి వరకు పబ్లిష్ కాలేదని క్రిస్టీస్ పేర్కొంది.

Next Story

RELATED STORIES