Omicron Death : బ్రిటన్‌లో తొలి ఒమిక్రాన్ మరణం
Omicron Death : ప్రపంచ దేశాల్లో వేగంగా విస్తరించిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు ప్రాణాలు తీయడం మొదలుపెట్టింది. యూకేలో తొలి ఒమిక్రాన్ మరణం సంభవించింది. ఈ విషయాన్ని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ధృవీకరించారు. ఒమిక్రాన్ భారీ అలలా ముంచుకొస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త వేరియంట్ వల్ల ఆస్పత్రుల పాలవుతున్నవారి సంఖ్య పెరుగుతుందన్నారు. తాజాగా ఈ వేరియంట్ బారినపడి ఒక వ్యక్తి మరణించడం బాధాకరం అని వ్యాఖ్యానించారు.
యూకేలో ఓమిక్రాన్ విజృంభన కొనసాగుతోంది. ఈ దేశంలోనే అత్యధికంగా, అతివేగంగా కేసులు నమోదతున్నాయి. యూకేలో ఇప్పటి వరకూ 3 వేలకు పైగా కేసులు నమోదు కాగా.. డెన్మార్క్‌లో 2 వేల 471, దక్షిణాఫ్రికాలో 779 నమోదయ్యాయి. ఇటు భారత్‌లోనూ 42 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే.. యూకేలో ఈ పరిస్థితి ఇలానే ఉంటే.. అత్యంత వేగంగా విస్తరిస్తోందని, అడ్డుకట్ట వేయకుంటే వచ్చే ఏడాది ఏప్రిల్, మే నాటికి 25 వేల నుంచి 75 వేల మరణాలు సంభవించే అవకాశముందని ఓ అధ్యయనం వెల్లడించింది.
నెమ్మదిగా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. దీంతో ఆయా దేశాల ప్రభుత్వాలు ఆంక్షలు పెంచుతున్నాయి. అమెరికాలో ఒమిక్రాన్ కేసులు బాగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా న్యూయార్క్ నగరంలో కొత్త కేసులు బయటపడుతున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com