Helicopter Crash : సముద్రంలో కుప్పకూలిన హెలికాప్టర్

Helicopter Crash : సముద్రంలో కుప్పకూలిన హెలికాప్టర్
స్పెషల్ ఆపరేషన్ సైనికులు మృతి..

తూర్పు మధ్యధరా సముద్రంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఐదుగురు యుఎస్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్స్ బలగాలు మరణించినట్లు అమెరికా అధికారులు ఆదివారం తెలిపారు. సైనికులు MH-60 బ్లాక్ హాక్ హెలికాప్టర్‌లోని సిబ్బంది. శుక్రవారం ఈ హెలికాప్టర్ రీఫ్యూయలింగ్ శిక్షణా మిషన్‌లో ఉంది, విమానం సైప్రస్ తీరంలో కూలిపోయింది. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోందని దీనిమీద పనిచేస్తున్న ముగ్గురు యూఎస్ అధికారులు తెలిపారు.స్పెషల్ ఆపరేషన్స్పెషల్ ఆపరేషన్

ఇజ్రాయెల్-హమాస్ ల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రాంతీయంగా విస్తరించకుండే ఉండేందుకు అమెరికా మధ్యదరా ప్రాంతంలో ఓ ఆర్మీ బృందాన్ని మోహరించింది. ప్రతీరోజూ ఈ బృందానికి శిక్షణా కార్యక్రమాలు ఉంటాయి. అవసరం పడితే ఈ ప్రాంతంలో అమెరికన్ పౌరులను ఖాళీ చేయడంలో సహాయం చేయడానికి, వారికి అండగా ఉండడానికి వీటిని వాడుతుంది. రోజువారీ సైనిక శిక్షణలో భాగంగానే నవంబర్ 10న బయల్దేరిన హెలికాప్టర్, సమస్యలు తలెత్తడంతో కుప్పకూలింది.

సైనిక శిక్షణలో భాగంగా ఐదుగురు సర్వీస్ సభ్యులను తీసుకువెళుతున్న యూఎస్ సైనిక హెలికాప్టర్ ప్రమాదానికి గురై మధ్యధరా సముద్రంలో కూలిపోయింది. హెలికాప్టరులో ఉన్న ఐదుగురు సర్వీస్ సభ్యులు మరణించారని యూఎష్ యూరోపియన్ కమాండ్ తెలిపింది. అధ్యక్షుడు జో బిడెన్ వైట్ హౌస్ నుంచి ఒక ప్రకటనలో మృతులకు నివాళులర్పించారు. ‘‘మా సైనిక సభ్యులు ప్రతిరోజూ మన దేశం కోసం వారి జీవితాలను త్యాగం చేశారు’’ అని బిడెన్ చెప్పారు. అమెరికన్ ప్రజలను సురక్షితంగా ఉంచడానికి సైనికులు రిస్క్ తీసుకుంటారు.వారి ధైర్యం, నిస్వార్థత మన దేశంలో ఉత్తమమైనదని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌ను గుర్తించిన రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ కూడా ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. హమాస్ దాడి అనంతరం గాజాపై ప్రతి దాడి కోసం వాషింగ్టన్ ఇజ్రాయెల్ కు సైనిక మద్ధతు అందించింది. ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో గాజాలో 11,100 మంది మరణించారు. ఈ యుద్ధంలో అమెరికాకు చెందిన పలువురు గాయపడ్డారు.

అమెరికా మిలటరీ విమానాలు ఇటీవల తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఏప్రిల్‌లో అలస్కాలోని మారుమూల ప్రాంతంలో శిక్షణా మిషన్ నుంచి తిరిగి వస్తున్న రెండు హెలికాప్టర్లు ఢీకొనడంతో ముగ్గురు యూఎస్ సైనికులు మరణించగా, మరొకరు గాయపడ్డారు. గత నెలలో కెంటుకీలో రాత్రిపూట శిక్షణా మిషన్‌లో రెండు యూఎస్ ఆర్మీ హెలికాప్టర్లు కూలిపోయాయి.



Tags

Read MoreRead Less
Next Story