అంతర్జాతీయం

కమలా హారిస్ పై కుట్రలో మహిళకు ఐదేళ్ల జైలుశిక్ష..!

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ హత్య కుట్రలో మహిళకు ఐదేళ్ల జైలుశిక్ష పడింది.

కమలా హారిస్ పై కుట్రలో మహిళకు ఐదేళ్ల జైలుశిక్ష..!
X

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ హత్య కుట్రలో మహిళకు ఐదేళ్ల జైలుశిక్ష పడింది. దక్షిణ ఫ్లోరిడాకు చెందిన నివియన్ పెటిట్ ఫెల్ప్స్‌ అనే మహిళ కమలా హారీస్‌ను చంపేందుకు ఫిబ్రవరిలో కుట్ర పన్నింది. అందుకు దాదాపు 53 వేల డాలర్లు ఒప్పందం కుదుకుర్చుకుంది. కేవలం 50 రోజుల్లో కమలా హారీస్‌ను మట్టుబెట్టాలని నిర్ణయించింది. తుపాకీ లైసెన్స్ అనుమతికి దరఖాస్తు చేసుకుంది. తన ప్లాన్‌కు సంబంధించి ముందస్తుగా వీడియో కూడా తీసింది. అయితే ఈ వీడియోను ఇతరులకు షేర్ చేయడంతో హత్య కుట్ర బయటపడింది. ముందుగానే అప్రమత్తమైన పోలీసులు నిందితురాలి కుట్రను భగ్నం చేశారు. నిందితురాలిని అరెస్టు చేసి మియామి ఫెడరల్ కోర్టులో హాజరుపర్చారు పోలీసులు. కేసును విచారించిన ఫెడరల్ కోర్టు.. నివియన్ పెటిట్‌కు ఐదేళ్ల పాటు జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.

Next Story

RELATED STORIES