Sri Lanka : ఆర్ధిక సంక్షోభంతో అతలాకుతలమైన శ్రీలంక.. చమురు నిల్వలన్నీ ఖాళీ

Sri Lanka: ఆర్ధిక సంక్షోభంతో.. శ్రీలంక అతలాకుతమవుతోంది. ఆ దేశంలో చమురు నిల్వలన్నీ ఖాళీ అయిపోయాయి. దీంతో పెట్రోల్ బంకుల్లో ఖాళీ బోర్డులు పెట్టారు. విదేశీ మారక నిల్వలు పూర్తిగా ఖాళీ కావడంతోనే.. శ్రీలంకకు ఈ పరిస్థితి దాపురించింది. రెండు షిప్పుల్లో చమురు వచ్చినా.... దానికి చెల్లించేందుకు డబ్బులు కూడా లేవు. అంత డబ్బు లేదని స్వయంగా ఆదేశం ఇంధన శాఖ మంత్రి ఉదయ గమ్మన్‌పిల ప్రకటించారు. విదేశీ మారక నిల్వలు కొరతతో శ్రీలంక ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్థమయింది. విదేశాల నుంచి వచ్చే చమురు కొనుగోలు చేసేందుకు తగిన మొత్తం తమ వద్ద లేదని గత వారమే ఆదేశం ప్రకటించింది. ఇప్పుడు మరోసారి అలాంటి ప్రకటన చేసింది.
ప్రభుత్వం నిర్ణయించిన ధరకే డీజిల్ అమ్మకడంతో గత ఏడాదిలోనే 415 మిలియన్ డాలర్ల నష్టం వచ్చింది. ప్రస్తుత పరిస్థితి నుంచి బయట పడాలంటే చమురు రిటైల్ ధరలను పెంచడమొక్కటే మార్గమంటోంది ప్రభుత్వం. అలాగే చమురుపై ఉన్న కస్టమ్స్ సుంకాన్ని తగ్గించి ఆ ప్రయోజనాలను ప్రజలకు బదిలీ చేయాలంటోంది. మరోవైపు... తక్షణావసరాలను తీర్చుకునేందుకు మన దేశానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి 40వేల మెట్రిక్ టన్నుల పెట్రోలు, డీజిలును ఈ నెల నెల మొదట్లో కొనుగోలు చేసింది శ్రీలంక.
అలాగే పెట్రో ఉత్పత్తుల కొనుగోళ్లకు దాదాపు 500 మిలియన్ డాలర్లు రుణంగా అందించేందుకు ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది. శ్రీలంకలో ఒక్క చమురే కాదు.. ఇతర నిత్యావర వస్తువుల ధరలు సైతం ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రధానంగా పర్యాటక ఆధారిత ఆర్థిక వ్యవస్థ అయిన లంకకు.. కరోనాతో గట్టి దెబ్బ తగిలింది. విదేశీ మారక నిల్వల కొరత ఎదుర్కోవడానికి ఇదీ ఓ కారణమైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com