Stuart MacGill: మాదకద్రవ్యాల కేసులో దోషిగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ స్టువర్ట్ మెక్‌గిల్

మాదకద్రవ్యాల సంబంధించి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ స్టువర్ట్ మెక్‌గిల్ దోషిగా తేలాడు. అతనిపై ఇదివరాలుడ్రగ్స్ కేసు నమోదు కాగా.. తాజాగా కోర్టు అతడిని దోషిగా తేల్చింది. ఈ కేసు కారణంగా మెక్‌గిల్ భవిష్యత్తు అంధకారంగా మారింది. మాదకద్రవ్యాల ముఖ్యంగా చెప్పుకొనే కొకైన్ సంబంధిత అక్రమ వ్యాపారంలో ఆయన తన బావమరిదితో కలిసి ఓ డ్రగ్ డీలర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కోర్టు నిర్ధారించింది. ఈ కేసు మొత్తం ఎనిమిది రోజుల పాటు విచారణ జరగగా.. న్యూ సౌత్ వేల్స్ కోర్టు నేడు (మార్చి 13) స్టువర్ట్ మెక్‌గిల్‌ను దోషిగా తేల్చింది.
ఇక కోర్టు ప్రకటన ప్రకారం, మెక్‌గిల్ తన బావమరిదికి మద్దతుగా ఓ డ్రగ్ డీలర్ తో కొకైన్ ఒప్పందం కుదుర్చుకున్నాడని.. అయితే, అతను స్వయంగా మాదకద్రవ్యాలను వినియోగించలేదని కోర్టు స్పష్టంగా తెలిపింది. 2021 ఏప్రిల్ లో ఈ డీల్ జరిగింది. మెక్‌గిల్ తన బావమరిది మారినో సోటిసోపౌలోస్ సహకారంతో న్యూట్రల్ బే రెస్టారెంట్ కింద పనిచేసే ఓ వీధి స్థాయి డ్రగ్ డీలర్‌తో కొకైన్ ఒప్పందాన్ని కుదుర్చుకోగా.. ఒప్పందానికి సంబంధించి 2 ప్రధాన సమావేశాలను మెక్‌గిల్ స్వయంగా ఏర్పాటు చేసినట్లు కోర్ట్ తెలిపింది.
కోర్టు విచారణ వివరాల ప్రకారం.. “ఇండివిజువల్ ఏ” గా గుర్తింపు పొందిన ఓ శాశ్వత డ్రగ్ డీలర్ మెక్‌గిల్, సోటిరోపౌలోస్ కలిసి 1 కేజీ కొకైన్ కోసం 3,30,000 ఆస్ట్రేలియా డాలర్స్ విలువైన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది ఇలా ఉండగా, తనపై వచ్చిన అరోపణలను పూర్తిగా ఖండించాడు మెక్‌గిల్. తనకి కొకైన్ అక్రమ రవాణాలో ప్రమేయం లేదని వాదించాడు. తాను నేరస్థుడిని కాదని, అన్యాయంగా కేసులో ఇరికించారని మెక్‌గిల్ తన వాదనలో పేర్కొన్నాడు. ఇక ప్రస్తుతం కోర్టు మెక్‌గిల్‌కు శిక్ష విధించే అంశాన్ని త్వరలో నిర్ణయించనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com