Israeli: ప్రీ ప్లాన్డ్‌గానే పేజర్ల పేలుళ్లు?

Israeli: ప్రీ ప్లాన్డ్‌గానే పేజర్ల పేలుళ్లు?
X

లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీ పేల్చి ఇజ్రాయెల్ విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంచలన విషయాలు బయటపెట్టారు. పదేళ్ల క్రితమే తాము వాకీటాకీల్లో పేలుడు పదార్థాలు అమర్చి ఆపరేషన్‌ చేపట్టామని తెలిపారు. ఇజ్రాయెల్‌ నుంచే వాటిని కొనుగోలు చేశామనే విషయం హెజ్‌బొల్లా పసిగట్టలేకపోయిందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్‌ వరకు వాటిని పేల్చలేదన్నారు.

అనుమతి ఇచ్చానని ఒప్పుకున్న ప్రధాని

లెబనాన్‌లో హెజ్‌బొల్లా మిలిటెంట్లతో పోరులో భాగంగా సెప్టెంబర్‌ 17న పేజర్ల పేలుళ్ల వ్యూహానికి తానే అనుమతి ఇచ్చానని ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు నెతన్యాహు అంగీకరించారు. ఈ విషయాన్ని నెతన్యాహు అధికార ప్రతినిధి ఒమెర్‌ దోస్త్రి ప్రకటించారు. నాటి పేజర్‌ పేలుళ్లలో నలభై మంది హెజ్‌బొల్లా మిలిటెంట్లు చనిపోయారు. మూడు వేల మంది గాయపడ్డారు. వాస్తవానికి నాడు జరిగిన పేజర్ల పేలుళ్ల ఘటనతో ఇజ్రాయెల్‌ వ్యూహాత్మకంగా హెజ్‌బొల్లాపై ఆధిపత్యం సాధించింది. ఇజ్రాయెల్‌ ట్రాక్‌ చేస్తుండటంతో దొరకకుండా ఉండేందుకు కేవలం పేజర్లు మాత్రమే వాడాలని నాటి హెజ్‌బొల్లా చీఫ్‌ నస్రల్లా సూచించడంతో హెజ్‌బొల్లా కేడర్‌ అంతా పేజర్లు వాడటం మొదలు పెట్టింది. దీంతో హమా్‌సకు మద్దతుగా తమపై దీటుగా పోరాడుతున్న హెజ్‌బొల్లాలను దెబ్బతీసేందుకు పేజర్‌ పేలుళ్ల వ్యూహాన్ని ఇజ్రాయెల్‌ ఇంటలిజెన్స్‌ సంస్థ మొసాద్‌ అమలు చేసింది. కాగా, పేజర్‌ పేలుళ్ల ఘటనపై లెబనాన్‌ ఈ నెల 6న ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేసింది.

ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు

ఈ పేజర్ల దాడి వెనుక ఇజ్రాయెల్‌ హస్తముందనే ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. దీనిపై లెబనాన్‌ ఐక్యరాజ్య సమితికి కూడా ఫిర్యాదు చేసింది. మానవత్వంపై జరిగిన దాడిగా వెల్లడించింది. ఇజ్రాయెల్ ప్రధాని ప్రతినిధి ఒమర్ దోస్త్రి మాట్లాడుతూ.. “లెబనాన్‌లో పేజర్ ఆపరేషన్‌కు తానే ఆమోదం తెలిపినట్టు నెతన్యాహు ధృవీకరించారు. పేజర్ దాడులపై ఐక్యరాజ్యసమితిలో టెల్ అవీవ్‌పై బీరూట్ ఫిర్యాదు చేసిన కొద్ది రోజుల తర్వాత లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల వెనుక ఉన్నది తానే అనే విషయాన్ని నెతన్యాహు మొదటిసారి బహిరంగంగా అంగీకరించడం గమనార్హం.

Tags

Next Story