Ex Japanese PM shot dead:జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్య..!

జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్య యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. నరా ఏరియాలోని ఓ సభలో ప్రసంగిస్తుండగా వెనుక నుంచి వచ్చిన ఓ దుండగుడు అబేపై దగ్గరి నుంచి కాల్పులు జరిపాడు. దీంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. మెడ భాగం నుంచి బుల్లెట్‌లు దూసుకుపోవడంతో.. తీవ్రంగా రక్తస్రావమైంది. ఆస్పత్రికి తరలించేలోపే కార్డియాక్ అరెస్ట్‌తో ప్రాణాలు కోల్పోయారు. కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
రెండ్రోజుల్లో జపాన్ అప్పర్ హౌస్‌కి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. లిబరల్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థుల తరపున షింజో అబే ప్రచారం చేస్తున్నారు. దీంట్లో భాగంగా సభలో మాట్లాడుతుండగా స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11.30కి షింజోపై అగంతకుడు కాల్పులు జరపడంతో అంతా షాక్‌కి గురయ్యారు. జరిగిన వెంటనే ఆయన నర మెడికల్ యూనివర్శిటీ హాస్పిటల్‌కు అబేను తరలించారు. ఆయన్ను కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించినా కార్డియాక్ పల్మనరీ అరెస్ట్‌తో ఆయన తుది శ్వాస విడిచారు.
67 ఏళ్ల షింజో అబే జపాన్ అభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషించారు. సుదీర్ఘ కాలం ప్రధానిగా పనిచేసిన అనుభవం ఆయనది. 2006లో ఒక ఏడాదిపాటు ప్రధాని పదవిలో ఉన్నారు. తర్వాత 2012 నుంచి 2020 వరకూ కూడా ఆయనే ప్రధానిగా ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com