టైటాన్ నిర్మాణంలో లోపాలు?

టైటానిక్ శకలాలను చూడటం కోసం వెళ్లిన టైటాన్ జలాంతర్గామి కుప్పకూలడంతో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ టైటాన్ జలాంతర్గామి నిర్మాణ సమయంలోనే అందులో లోపాలు ఉన్నట్లు ఓ నిపుణుడు గుర్తించాడు. ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకు వెళ్ళాడు.. కాని జల అంతర్గమిలో లోపాలు సరి చేయాల్సిన కంపెనీ ఆ లోపాలు చూపించిన నిపుణుడిని ప్రాజెక్టు నుండి తొలగించింది.
12 వేల మీటర్ల లోతులోని టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు ఐదుగురు పర్యాటకులతో ఆదివారం న్యూఫౌండ్‌ల్యాండ్ నుంచి మినీ జలాంతర్గామి వెళ్లింది. బయలుదేరిన కొద్ది గంటల్లోనే దీని నుంచి రాడార్‌కు సంకేతాలు నిలిచిపోవడంతో ఆందోళన మొదలైంది. దీంతో జలాంతర్గామి కోసం కెనడా, అమెరికా కోస్ట్‌గార్డ్ దళాలు మూడు రోజుల పాటు రేయింబవళ్లూ గాలించాయి. అయినా వారి ప్రయత్నం ఫలించలేదు. ఐదుగురూ విగత జీవులయ్యారు.
అసలు టైటాన్ జలాంతర్గామి నిర్మాణం సమయంలో దాని సామర్థ్యంపై లోచ్ రిడ్జ్ అనే నిపుణుడికి సందేహం వచ్చింది. టైటాన్ కు మరిన్ని పరీక్షలు నిర్వహించాలని, సముద్రంలో ఇది లోతుకు వెళ్లినప్పుడు ప్రయాణికులకు ముప్పు వాటిల్లవచ్చునని 2018లోనే నాటి ఓషన్ గేట్ సంస్థ మెరైన్ ఆపరేషన్స్ డైరెక్టర్ తన నివేదికలో విశ్లేషించారు. దీనిపై సియాటెల్ కోర్టులో వ్యాజ్యం కూడా దాఖలైంది. అయితే కంపెనీ విషయాలను బహిర్గతం చేస్తూ ఒప్పందాన్ని ఉల్లంఘించాడంటూ అతని మీద ఓషన్ గేట్ వ్యాజ్యం వేసింది. అంతే కాదు అదే కారణంగా చూపి ఉద్యోగం నుంచి తొలగించింది. అయితే టైటాన్ భద్రత గురించి, అందులోని లోపాలను చెప్పినందుకే తనను ఉద్యోగం నుండి తొలగించారని, ఇది అక్రమమని ఆ నిపుణుడు కౌంటర్ దాఖలు చేశారు.అప్పుడు ఈ వివాదం సెటిల్మెంట్ తో ముగిసింది. తరువాత కూడా ఓషన్ గేట్ సంస్థ కొన్ని హెచ్చరిక అందుకున్నప్పటికీ పెద్ద సీరియస్గా తీసుకోలేదు. జూన్ 18 న లోతైన సముద్రంలోకి వెళ్ళడం వల్ల రాడార్ తో జలాంతర్గామికి సంబంధం తెగిపోయింది. దీని కారణంగా టైటాన్ జలాంతర్గామి తప్పిపోయింది. టైటాన్ జలాంతర్గామి కోసం సెర్చ్ ఆపరేషన్ సుమారు 100 గంటల పాటు కొనసాగింది. ఆ తరువాతే ప్రయాణీకులందరూ చనిపోయినట్లు ధృవీకరించారు.
టైటాన్ సబ్‌మెర్సిబుల్‌లో ఉన్న ఐదుగురు వ్యక్తులు సముద్రపు లోతులో ఉన్న ప్రజర్, ఆక్సిజన్ లేకపోవడం వంటి కారణాలవల్ల తక్షణమే, నొప్పిలేకుండా చనిపోయి ఉంటారని యుఎస్ నేవీ మాజీ వైద్యుడు డేల్ మోలే చెప్పారు. టైటానిక్ శిధిలాలను చూపించే ఈ యాత్రను ఓసింగేట్ ఎక్స్‌పెడిషన్స్ అనే కంపెనీ పర్యవేక్షిస్తోంది. కంపెనీ డేటా ప్రకారం.. 2021 , 2022లో టైటానిక్ శిధిలాలను చూడటానికి కనీసం 46 మంది ఓసిగేట్ జలాంతర్గామి వద్దకు విజయవంతంగా ప్రయాణించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com