అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై మాజీ అధ్యక్షుడు ఒబామా విమర్శలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా విమర్శలు గుప్పించారు. డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ మహమ్మారిని సీరియస్‌గా తీసుకోలేదని, ట్రంప్ తన అహాన్ని పోషించడంపై దృష్టి సారించారని బరాక్ ఒబామా ఆరోపించారు.
మరో వైపు ట్రంప్ నిర్వహించిన 18 ర్యాలీల కారణంగా అమెరికా వ్యాప్తంగా దాదాపు 30 వేల మందికి కరోనా వైరస్ సోకగా.. మరో 700 మంది చనిపోయారని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకుల కొత్త అధ్యయనంలో వెల్లడైంది. వైరస్ వ్యాప్తిని ఏమాత్రం లెక్కచేయకుండా నిబంధనలు ఉల్లంఘించి ప్రచార ర్యాలీలు నిర్వహించడం కారణంగానే పౌరులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. ఈ మేరకు జూన్ 20 నుంచి సెప్టెంబర్ 22 వరకు ట్రంప్ నిర్వహించిన 18 ర్యాలీల ద్వారా సేకరించిన డేటా ఆధారంగా ఈ నివేదికను బహిర్గతం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com