Bashar al Assad: సిరియా మాజీ అధ్యక్షుడిపై విషప్రయోగం? పరిస్థితి విషమం

సిరియా మాజీ అధ్యక్షుడు, రష్యాలో ఆశ్రయం పొందుతున్న బషర్ అల్ అసద్‌పై విష ప్రయోగం జరిగినట్టు తెలుస్తున్నది. ఈ విషయాన్ని జనరల్ ఎస్వీఆర్ పేరుతో సోషల్ మీడియా ఖాతాను నిర్వహిస్తున్న రష్యా మాజీ గూఢచారి వెల్లడించారు. ఆదివారం మాస్కోలో అసద్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, తీవ్రమైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డట్టు చెప్పారు. రష్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్యులు అసద్ ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోనే చికిత్స అందిస్తున్నారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్టు తెలిపారు. అసద్ ఒంట్లో విషం ఉన్నట్టు వైద్యులు గుర్తించారని చెప్పారు.
సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అసద్ప రిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఆయన తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. మాస్కోలో ఆయనపై విషప్రయోగం జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన తీవ్ర దగ్గుతో పాటు ఊపిరి తీసుకోవడంలో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అసద్‌పై తీవ్ర హత్యాయత్నం జరిగినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. అయితే అసద్ ఆరోగ్యంపై ఇప్పటి వరకు రష్యా స్పందించలేదు. వైద్య టెస్టుల్లో మాత్రం విషం ఉన్నట్లుగా తేలింది. ప్రస్తుతం ఆయన ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోనే చికిత్స పొందుతున్నట్లుగా మీడియా తెలిపింది.
ఇటీవల సిరియా తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. రెబల్స్.. డమాస్కస్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో అసద్, కుటుంబంతో కలిసి డిసెంబర్ 8, 2024న రష్యాకు పారిపోయాడు. అక్కడ రాజకీయ శరణార్థిగా ఉంటున్నారు. అయితే అసద్ భార్య అస్మా పరిస్థితి కూడా సీరియస్‌గా ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్నారు. 50-50 శాతమే ఛాన్స్ ఉందని వైద్యులు వెల్లడించారు. దీంతో ఆమె సొంత దేశమైన యూకేకు వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకుంది. భర్తకు విడాకులు ఇచ్చి.. యూకేకు వెళ్లిపోవాలని అనుకుంటున్నట్లుగా సామాచారం. ఇంతలోనే అసద్‌పై విషప్రయోగం జరగడం తీవ్ర సంచలనంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com