France : పిజ్జాలు అమ్ముకుంటోన్న మాఫియా కింగ్...
ప్రేమ కావ్యాలకు పెట్టింది పేరైన ఫ్రాన్స్ మహానగరం అప్పుడప్పుడు క్రైమ్ స్టోరీలకూ కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారుతుంటుంది. ఇదే విధంగా గత 16ఏళ్లు ఈ సుందర నగరంలో ఓ కేఫే నడుపతూ ప్రశాంతంగా జీవితం గడిపేస్తున్న ఓ మాజీ మాఫియా కింగ్ అరెస్ట్ లో నగరం ఉలిక్కిపడింది. కేఫే రోజినీ అనే రెస్టారెంట్ స్థానికంగా మంచి పిజాలకు పెట్టింది పేరు. థిన్ క్రస్ట్ పై సాస్ మోజెరెల్లా ఛీజ్, రకరకాల టాపింగ్స్ తో తయారయ్యే ఇక్కడి పిజా స్థానికులతో పాటూ, టూరిస్టులను ఎంతగానో నోరూరిస్తుంటుంది. అయితే, ఇన్నాళ్లూ రుచికరంగా పిజ్జాలు వండిపెట్టిన ఆ షెఫ్.. కనిపించే అంత అమాయకుడు కాదని తెలుసుకున్న జనాలు ఒక్కాసారిగా విస్తుపోయారు. పాలో దిమిత్రీయో పేరుతో చెలామణి అవుతున్న ఈ వ్యక్తి నిజానికి ఓ మాఫియా బాస్. అసలు పేరు ఎగార్డో గ్రెకో. ఇటలీలో రెండు మర్డర్లు చేసి, శవాలను యాసిడ్ లో వేసి కాల్చేసిన దుర్మార్గుడు, 16ఏళ్ల నుంచి చట్టం నుంచి తప్పించుకుని తిరుగుతున్న నేరగాడు. 1990లో ఇటలీలో జరిగిన మాఫియా వార్ లో భాగంగా ఈ హత్యలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సమాచారం అందుకున్న ఇంటర్పోల్ పోలీసులు ఎగార్డోను అదుపులోకి తీసుకున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com