Guinness Record: రికార్డ్ కోసం మంటలతో పరుగు

Guinness Record: రికార్డ్ కోసం మంటలతో పరుగు
ఒంటిపై మంటలతో 17 సెకండ్లలో 100 మీటర్లు పరుగెత్తిన ఫైర్ ఫైటర్

ఒళ్ళు కాలిపోతుంటే ఏం చేస్తారు.. ఎవరైనా సరే బాబోయ్ మంటలు అంటూ భయపడిపోతారు. దగ్గర్లో ఉన్న ఏ నీళ్లలోకైనా దూకేస్తారు కానీ ఒకతను కావాలని ఒంటిపై మంటలు అంటించుకొని పరిగెత్తి రికార్డు సృష్టించాడు.

ఫ్రాన్స్ కు చెందిన జోనాథన్ ఒక ప్రొఫెషనల్ స్టంట్ మాన్. అతనికి చిన్నప్పటి నుంచి మంటలంటే ఒకలాంటి ఇష్టం. అందుకే ఫైర్ ఫైటర్ గా ప్రొఫెషన్ తీసుకున్నాడు. అంతే కాదు ఫైర్ షోలు కూడా ఇచ్చేవాడు. మంటలు ఆర్పడం, వాటి నుంచి తప్పించుకోవడం, ఫైర్ జంగ్లింగ్ ఇలా వెరైటీ ప్రదర్శనలలో పాల్గొనేవాడు. ఈ ఎక్స్పీరియన్స్ తో ఒక కొత్త రికార్డుకు ప్రయత్నించాడు. ఆక్సిజన్ అందకుండా మంటలు ఒంటికి అంటించుకుని అత్యంత వేగంగా పరిగెట్టి రికార్డు సృష్టించటానికి డిసైడ్ అయ్యాడు. ఇందుకోసం వళ్ళంతా పూర్తిగా కవర్ అయ్యేలా ఒక సూట్ వేసుకుని రన్నింగ్ ట్రాక్ లో నిలబడ్డాడు. తర్వాత అతని సహాయకులు అతని వీపు భాగానికి నిప్పంటించారు. ఇంకా అప్పుడు మొదలుపెట్టిన పరుగు 17 సెకండ్లలో 100 మీటర్లు దాటగానే పూర్తయింది. అతను పరిగెత్తిన స్పీడ్ కి డెస్టినేషన్ పాయింట్ కి చేరుకునే లేపే మంటలు ఆగిపోయాయి. అయినా సరే సహాయకులు అతనిపై మంటలు ఆర్పడానికి కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ ను స్ప్రే చేశారు. మొత్తానికి 100 మీటర్లు ఆక్సిజన్ లేకుండా మంటలు అంటించుకొని 17 సెకెన్లలో పరుగేట్టే గిన్నిస్ రికార్డ్ సృష్టించాడు.

ఇలా చేయడం ద్వారా మొత్తానికి రెండు రికార్డ్ లు బ్రేక్ చేశాడు. 17 సెకండ్లలో 100 మీటర్ల పరుగు ఒక రికార్డు కాగా, అత్యధికంగా 272.25 మీటర్ల పరుగు రెండవ రికార్డ్. గతంలో ఈ రెండు రికార్డులు ఆంటోని బ్రిట్టన్ అనే యూకే వ్యక్తి పేరు మీద ఉండేవి. ఇప్పుడు అతని రికార్డ్ను 7.58 సెకండ్లతో అధిగమించాడు జోనాథన్. ఈ ప్రదర్శన తనకు శిక్షణ ఇచ్చిన వారికి అంకితం ఇస్తున్నానన్న ఆయన ఇలాంటి రికార్డు చేయటం కోసం తాను ప్రతిరోజు ఎంతగానో ప్రాక్టీస్ చేశానని చెప్పాడు. ఇక్కడితో ఆగేది లేదని ఇంకా వివిధ రకాల రికార్డులు సృష్టించడానికి ప్రయత్నిస్తానని చెబుతున్నాడు.







ఈ రికార్డుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. అయితే దీనిపై నెటిజన్లు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. జోనాథన్ ధైర్యానికి కొందరు వహ్వా అంటుంటే, ఇలాంటి మూర్ఖపు రికార్డులు ఎందుకు చేస్తారు, ఇలాంటి ప్రమాదకరమైన ఫీట్ల అవసరం ఏముంది అంటూ ఇంకొందరు మండిపడుతున్నారు.

Tags

Next Story