French Minister : అసభ్యకరంగా ఫ్రాన్స్ మినిస్టర్ ఫోటో

ప్లేబాయ్ మ్యాగజిన్ కవర్ పేజీపై ఫ్రాన్స్ మినిస్టర్ ఫోటో దుమారం రేపుతుంది. మాక్రన్ సర్కార్ ప్రవేశపెట్టిన రిటైర్మెంట్ ఏజ్ ప్లాన్ పై ప్రాన్స్‌లో ఆందోళలను జరుగుతున్న నేపధ్యంలో మంత్రి మర్లీన్ షియప్పా ఇష్యూ ప్రాన్స్ పాలిటిక్స్‌లో మరింత హీట్ పెంచేసింది. 40 ఏళ్ల ఫెమినిస్టు మంత్రి అయిన మర్లీన్.. మాక్రన్ ప్రభుత్వంలో 2017 నుంచి మంత్రిగా చేస్తున్నారు. అయితే ప్లేబాయ్ పత్రికపై ఆ మంత్రి ఫోటో కవర్ పేజీలో ప్రత్యక్షం కావడంలో అక్కడి అతివాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మర్లీన్ షియప్పా ప్లేబాయ్ మ్యాగజిన్ కు 12 పేజీల ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. మహిళా, గే, అబార్షన్ హక్కుల గురించి ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. మహిళా హక్కుల్ని డిఫెండ్ చేస్తూ ఆమె మాట్లాడారు. ఫ్రాన్స్‌లో మహిళలు స్వేచ్ఛగా ఉంటారని, ఆ పద్ధతి ఎవర్ని ఇబ్బందిపెట్టినా ఇక్కడ అదే శైలి ఉంటుందని అంటూ ఆమె ట్వీట్ చేశారు. మంత్రి మర్లీన్ ఫోటో స్టంట్‌పై స్వంత పార్టీలోనే వ్యతిరేకత వస్తుంది. మంత్రి మర్లీన్ వైఖరిని అనేక మంది తప్పుపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com