French : చిన్న పిల్లలు, మహిళ పై దాడులు ఆపాలన్న ఇమ్మాన్యుయేల్ మాక్రాన్

గాజాలో ఇజ్రాయెల్ బాంబుల విధ్వంసం.. సమర్థనీయం కాదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ స్పష్టం చేశారు. హమాస్ తో ఎలాంటి సంబంధం లేని పౌరులపై ఇజ్రాయెల్ బాంబు దాడులు ఆవేదన కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులపై బాంబులకు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన మాక్రాన్ .. వీటిని ఆపేయాలని అభ్యర్థించారు. మాక్రాన్ ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు.ప్రపంచదేశాలు ఖండిచాల్సింది హమాస్ ను కానీ.. ఇజ్రాయెల్ ను కాదని వ్యాఖ్యానించారు. హమాస్ సామాన్యులను మానవకవచాలుగా ఉపయోగించుకుంటోందని వివరించారు. ఇవాళ.. ఇజ్రాయెల్లో జరిగిన దాడులే రేపు పారిస్ , న్యూయార్క్ లలో జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. గాజాలో సంభవిస్తున్న మరణాలకు పూర్తి బాధ్యత హమాస్ దే కానీ ఇజ్రాయెల్ ది కాదని స్పష్టం చేశారు. కాగా.. ఇజ్రాయెల్ చర్యలపై ఇప్పుడిప్పుడే అసంతృప్తి వెల్లడవుతోంది. కాల్పుల విరమణ పాటించాలని ఇప్పటికే అమెరికా పలుమార్లు ఇజ్రాయెల్ కు చెబుతూ వస్తోంది.
గాజాపై చేస్తున్న దాడులనుఆపేయాలని ఇజ్రాయిల్‌ను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యువల్ మాక్రన్ కోరారు. పిల్లలు, మహిళల్ని చంపేస్తున్నారని, ఆ మారణహోమాన్ని నిలిపివేయాలన్నారు. అర్థం లేని రీతిలో బాంబు దాడుల్ని కొనసాగిస్తున్నారని, ఆ బాంబు దాడుల్ని ఆపాలని కోరుతున్నట్లు మాక్రన్ తెలిపారు. హమాస్ చేపట్టిన ఉగ్రవాద చర్యలను ఫ్రాన్స్ ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు.
గాజాపై అటాక్ విషయం మాక్రన్ చేసిన సూచనను.. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యూ తోసిపుచ్చారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారమే తాము మిలిటరీ కేంద్రాలను టార్గెట్ చేస్తున్నట్లు తెలిపారు. అటాక్ చేయడానికి ముందు వార్నింగ్ ఇస్తున్నామని, పౌరుల మరణాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com