లాలించిన అమ్మ లేదింక.. ఆత్మాహుతి దాడిలో..

లాలించిన అమ్మ లేదింక.. ఆత్మాహుతి దాడిలో..
ఎవరు కన్నబిడ్డో.. ఆమె చేతుల్లో భద్రంగా ఉంది. అమాయకపు చూపులు చూస్తున్న ఆ చిన్నారిని ఎత్తుకుని మురిసిపోయింది.

ఎవరు కన్నబిడ్డో.. ఆమె చేతుల్లో భద్రంగా ఉంది. అమాయకపు చూపులు చూస్తున్న ఆ చిన్నారిని ఎత్తుకుని మురిసిపోయింది. విధి నిర్వహణలో భాగమే అయినా తల్లి మనసు తల్లడిల్లింది. బిడ్డను సురక్షిత ప్రదేశానికి చేర్చి ఉద్యోగానికి న్యాయం చేసింది.

ఓ వారం రోజుల క్రితం సోషల్ మాధ్యమాల్లో ఈ ఫోటో వైరల్ అయింది. తాలిబన్ల ఆక్రమణతో ఆఫ్గను కిందా మీదా పడి సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్న తరుణంలో ఎంతో మంది తల్లులు తమ బిడ్డలను అమెరికన్ సైనికుల చేతుల్లో ఉంచారు.

మేం ఉంటామో లేదో.. మా బిడ్డల్నైనా రక్షించండి అని వారి చేతుల్లో ఉంచారు. అలా అమెరికా సైనికురాలు సార్జెంట్ నికోల్ ఎల్ గీ చేతిలోకి వచ్చి చేరిందో చిన్నారి. తన ఒడిలోకి చేరిన చిన్నారితో పాటు ఎంతో మంది ఆఫ్గన్ల ప్రాణాలు కాపాడిన ఆమె తన ప్రాణాలు కాపాడుకోలేకపోయింది.

కాబుల్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో నికోల్ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన అమెరికన్లను కదిలించింది. ఆమె మరణించడానికి కచ్చితంగా వారం రోజుల ముందు పోస్ట్ చేసిన ఫోటో చూసి అమెరికన్లు చలించిపోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story