Gabon: మరో ఆఫ్రికా దేశంలో సైనిక తిరుగుబాటు

పశ్చిమ ఆఫ్రికా(Africa)లోని గబాన్(Gabon) దేశంలో సైనికులు తిరుగుబాటు( military seizes power) చేశారు. అధ్యక్షుడు బాంగో(President under house arrest)ను గృహ నిర్బంధం చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. గత శనివారమే అధ్యక్షుడిగా బాంగో ఎన్నిక కాగా మూడ్రోజుల్లోనే ఎన్నికల ఫలితాలను రద్దు చేస్తున్నట్లు మిలిటరీ అధికారులు ప్రకటించారు. అలీ బొంగో కుమారుడు నౌరెద్దీన్ బొంగో వాలెంటిన్, అతని ముఖ్య అధికారులు, సలహాదారులను అరెస్టు చేసినట్లు మిలటరీ ప్రకటించింది. బాంగో కుమారుల్లో ఒకరిని దేశద్రోహం కింద అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దీంతో 56 ఏళ్లుగా గబాన్‌ను పాలిస్తున్న బాంగో కుటుంబ శకం ముగిసింది.
గాబన్‌కు ఇంధన సంపన్న దేశం(oil-producing Gabon )గా పేరుంది. అలీ బొంగో 2009 నుంచి ఆ దేశ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గత 55 ఏళ్లుగా గాబన్‌ను వారి వంశస్థులే పాలిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలను రద్దు చేయడంతో పాటు సరిహద్దులను మూసి వేస్తున్నట్లు సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు. సైనికుల అధికారాన్ని చేజిక్కుంచుకున్నారన్న వార్తలతో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి సంబరాలు(People celebrate) చేసుకున్నారు. సైనికులకు అభినందనలు తెలిపారు. గబాన్‌లో సైనికుల చర్యను ఫ్రాన్స్ తీవ్రంగా ఖండించింది.
అన్ని రిపబ్లిక్ సంస్థలను, ఎన్నికల ఫలితాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తూ సరిహద్దులను సైన్యం తమ అధీనంలోకి తీసుకుంది. సైన్యం చుట్టిముట్టి ఉండగా.. ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని ఓ అధికారి టీవీలో ప్రకటన విడుదల చేశారు. దేశంలో అధ్వాన పాలన కొనసాగుతోందని పేర్కొన్నారు. అందుకే గాబన్ ప్రజల తరఫున ‘సంస్థల పరివర్తన, పునరుద్ధరణ కమిటీ’ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
బొంగో 2009లో గాబన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ శనివారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో బొంగో 64.27 శాతం మెజారిటీతో మూడోసారి గెలిచినట్లు వెల్లడైంది. ఈ ప్రకటనతో ఆగ్రహించిన విపక్ష నేత ఆల్బర్ట్ ఆండో ఒస్సా అవి తప్పుడు ఫలితాలని ఆరోపించారు. ఎలాంటి రక్తపాతం జరగకముందే తనకు అధికారం అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు కర్ఫ్యూ విధించి, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. సైన్యం అధికారాలను హస్తగతం చేసుకున్నాక ఆ సేవలను పునరుద్ధరించారు.
గాబన్ జనాభా కేవలం 23 లక్షలు మాత్రమే. ఈ దేశం ఫ్రాన్స్ నుంచి స్వాతంత్ర్యం పొందింది. ఒప్పందంలో భాగంగా ఇప్పటికీ 370 మంది ఫ్రాన్స్ సైనికులు గాబన్‌లో పహారా కాస్తున్నారు. తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బోర్న్ తెలిపారు. బొంగో కుటుంబం తొలి నుంచి ఫ్రాన్స్‌కు విధేయులుగా ఉంటూ ఆ దేశంలో వ్యాపారాలు సాగిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com