Pakistan: పాక్‌లో దుర్భర పరిస్థితులు.. సిలిండర్ ధర తెలిస్తే షాకే..

Pakistan: పాక్‌లో దుర్భర పరిస్థితులు.. సిలిండర్ ధర తెలిస్తే షాకే..
Pakistan: పాకిస్తాన్‌ ఆర్థిక సంక్షోభంతో విలవిలలాడుతుంది. రాయితీపై అందించే నిత్యావసర వస్తువులపై ప్రభుత్వం కోత పెడుతోంది.

Pakistan: పాకిస్తాన్‌ ఆర్థిక సంక్షోభంతో విలవిలలాడుతుంది. రాయితీపై అందించే నిత్యావసర వస్తువులపై ప్రభుత్వం కోత పెడుతోంది. మరోవైపు ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడ సిలిండర్‌ ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే అక్కడ ఒక్కో సిలిండరు 3వేల 652 రూపాయలు. మన కంటే మూడురెట్లకు పైగా అధికం. పాక్‌ ఎంత దుర్భర పరిస్థితిలో ఉందనడానికి ఇదే ఉదాహరణ. కొంత కాలంగా పాక్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దేశ ప్రజలకు వంట గ్యాస్‌ కూడా అందించలేని దీన స్థితిలోకి వెళ్లింది.


దీంతో అక్కడి ప్రజలు సిలిండర్లు కొనలేక ప్లాస్టిక్‌ సంచుల్లో గ్యాస్‌ను కొంటున్నారు. కరక్‌ జిల్లాలో దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గ్యాస్‌ నింపిన ప్లాస్టిక్‌ సంచులను రోడ్డుపై ప్రజలు లాక్కెళ్తున్నారు. అయితే ఈ సంచుల వల్ల జరిగిన ప్రమాదాల్లో ఇప్పటికే 8 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ప్లాస్టిక్‌ బ్యాగుల్లో 3-4 కేజీల గ్యాస్‌ నింపేందుకు గంట సమయం పడుతోంది.


అటు.. విద్యుత్‌ సంక్షోభంలో ఉన్న పాక్‌.. దేశవ్యాప్తంగా మార్కెట్లు, మాల్స్‌ను రాత్రి ఎనిమిదిన్నరకే మూసివేయించాలని నిర్ణయించింది. కళ్యాణ మండపాలకు రాత్రి 10 గంటల వరకే అనుమతి ఉంటుందని ప్రకటించింది. ఫ్యాన్ల ఉత్పత్తి ఆపేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజల మనుగడ కూడా కష్టంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story