రెస్టారెంట్ లో గ్యాస్ లీక్.. 31 మంది మృతి

రెస్టారెంట్ లో గ్యాస్ లీక్.. 31 మంది మృతి
చైనా రెస్టారెంట్‌లో ఎల్‌పిజి లీక్ కారణంగా 31 మంది చనిపోయారు.

చైనా రెస్టారెంట్‌లో ఎల్‌పిజి లీక్ కారణంగా 31 మంది చనిపోయారు. చైనాలోని బార్బెక్యూ రెస్టారెంట్ లో గ్యాస్ లీక్ కారణంగా పేలుడు సంభవించింది.. ఈ ప్రమాదంలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు అని రాష్ట్ర వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. మరో ఏడుగురు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది.

బుధవారం రాత్రి 8:40 గంటలకు పేలుడు సంభవించింది. నింగ్జియా రాజధాని డౌన్‌టౌన్ యిన్‌చువాన్‌లోని నివాస ప్రాంతంలోని ఫుయాంగ్ బార్బెక్యూ రెస్టారెంట్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మూడు రోజుల డ్రాగన్ బోట్ ఫెస్టివల్ సెలవుదినం సందర్భంగా, చైనాలో చాలా మంది ఇళ్లలో కంటే బయటకు వెళ్లి స్నేహితులతో కలిసి రెస్టారెంట్ కు వెళ్లి ఈ విషాదం చోటు చేసుకుంది.

చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ "గాయపడిన వారికి త్వరిత గతిన చికిత్స అందించాలని కోరారు. ప్రజల జీవితాలు, ఆస్తులను సమర్థవంతంగా రక్షించడానికి కీలకమైన పరిశ్రమలలో భద్రతా పర్యవేక్షణను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు". పేలుడు నేపథ్యంలో స్థానిక అగ్నిమాపక శాఖ రెస్క్యూ టీమ్ తో సహా 100 మందికి పైగా మరియు 20 వాహనాలను సంఘటనా స్థలానికి పంపినట్లు అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ తెలిపింది. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని సాధ్యమైనంతవరకు ప్రాణనష్టం తగ్గించాలని మంత్రిత్వ శాఖ అధికారులను కోరింది.

Tags

Read MoreRead Less
Next Story