Gigi Hadid: గంజాయి అక్రమ రవాణాలో సూపర్ మోడల్

గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిందని ఆరోపణతో అమెరికన్ సూపర్ మోడల్ గిగి హాదిద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 10వ తేదీన తన దోస్తులతో కలిసి ఓ ప్రైవేట్ విమానంలో కేమెన్ దీవుల్లో దిగింది ఈ మోడల్. అయితే ఎందుకో పోలీసులకు ఈమె మీద అనుమానం వచ్చింది. వెంటనే ఆమెను తనిఖీ చేశారు పోలీసులు. ఆమె దగ్గర గంజాయితో పాటు దాన్ని వినియోగించేందుకు ఉపకరించే పరికరాలు కూడా ఆమె లగేజ్ లో దొరికాయుట. వెంటనే హదిద్ తో పాటూ ఆమె స్నేహితురాలని, తల్లిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ స్థానిక రాయల్ కేమన్ ఐలాండ్స్ డిటెన్షన్ సెంటర్ కు వీరిని తరలించారు. వెయ్యి డాలర్ల జరిమానా విధించి బెయిల్ పై విడుదల చేశారు.
వీరు జూలై 12వ తేదీన కోర్టుకు హాజరయ్యారని అక్కడ వారు నేరాన్ని అంగీకరించారని తెలుస్తోంది. అయితే న్యూయార్క్ లో మెడికల్ లైసెన్స్ తో హదీద్ చట్టబద్ధంగా గంజాను కొనుగోలు చేసిందని వెల్లడైంది.
ఈమెపై గతంలో ఎలాంటి కేసులూ లేవని పోలీసులు చెబుతున్నారు. హాలీవుడ్ నటుడు లియోనార్డో డీ కాప్రియోతో గీగీ హదీద్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. గత నెలలో వరుసగా హాంప్టన్స్ లోని రెండు వేరువేరు పార్టీలలో ఇద్దరు కలిసి కనిపించారు. న్యూయార్క్ నగరంలో ఫ్యాషన్ వీక్ సందర్భంగా సెప్టెంబర్ 2022లో ఈ జంట మొదటి సారి డేటింగ్ పుకార్లను ఎదుర్కొంది. తరువాత నుంచి అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. గిగీకి ఇప్పటికే రెండేళ్ల కూతురు ఉంది.
Tags
- Gigi Hadid
- ganja
- Leonardo DiCaprio
- gigi hadid arrested
- gigi hadid arrested in cayman
- gigi hadid arrest
- gigi hadid arrest drug possession
- gigi hadid
- gigi hadid arrested in cayman islands
- gigi hadid arrest for drugs
- lauren jauregui arrested
- arrest
- gigi hadid arrested on vacation
- gigi hadid arrested cayman islands
- lauren jauregui arrested for weed
- arrested
- gigi hadid cayman arrest
- gigi hadid arrest cayman islands
- gigi hadid marijuana arrest
- gigi hadid cayman islands arrest
- marijuana possession
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com