Italy PM Giorgia Meloni: మోదీతో సెల్ఫీ దిగిన ఇటలీ ప్రధాని

జీ7 దేశాల భేటీకి వెళ్లిన ప్రధాని మోదీ ఇండియా తిరిగి వచ్చారు.. కానీ ఆ విషయమకంటే చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే శుక్రవారం అక్కడ ప్రధాని మోదీతో ఇటలీ ప్రధాని మెలోని సెల్ఫీ దిగారు. చేతిలో ఫోన్ పట్టుకున్న మెలోనీ.. మోదీతో ఫోటో దిగారు. ఆ సెల్ఫీ ఫోటో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. జీ7 శిఖరాగ సదస్సు సందర్భంగా జార్జియా మెలోనీతో ద్వైపాక్షిక చర్చల్లో మోదీ పాల్గొన్నారు. ఇటలీలోని అపులియాలో సమావేశాలు జరిగాయి. సెల్ఫీ దిగుతూ ఇద్దరూ ఫుల్ స్మైల్ ఇచ్చుకున్నారు. గత ఏడాది దుబాయ్‌లో కాప్28 సదస్సు జరిగిన సమయంలో కూడా సెల్ఫీ దిగారు. ఆ ఫోటో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. మూడవ సారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన మోదీ తొలిసారి విదేశీ టూర్‌కు వెళ్లారు. మెలోనీ ఆహ్వానం మేరకు ఆయన ఇటలీ వెళ్లారు. ఇద్దరూ ద్వైపాక్షిక రక్షణ, భద్రతా సహకారంపై చర్చించారు.
జీ-7 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది. ప్రపంచంలోని అగ్రనాయకులలో కూడా అతని క్రేజ్ కనిపించింది. వరుసగా మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఆయన చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇదే. ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో సహా అనేక మంది ప్రపంచ నాయకులతో సంభాషించారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కూడా ఆయనతో సెల్ఫీ దిగారు. ఇది కాకుండా గ్రూప్ ఫోటో సమయంలో అతనికి వేదిక మధ్యలో ఒక ముఖ్యమైన స్థానం ఇచ్చారు.
ఇక ప్రధాని మోడీ కూడా శనివారం ఉదయం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు అందులో.. “అపులియాలో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశం చాలా ఉపయోగకరంగా ఉంది. ప్రపంచ నేతలతో కలిసి సంభాషించి పలు అంశాలపై చర్చించారు. గ్లోబల్ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చే ప్రభావవంతమైన పరిష్కారాలను రూపొందించడం, భవిష్యత్తు తరాలకు మెరుగైన ప్రపంచాన్ని నిర్మించడం మా లక్ష్యం. ఇటలీ ప్రజలు, ప్రభుత్వం వారి సాదర ఆతిథ్యానికి ధన్యవాదాలు.’’ అంటూ రాసుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com