TikTok Challenge : బొమ్మ పేలి .. కోమాలోకి వెళ్లిన ఏడేళ్ల బాలిక

TikTok Challenge :  బొమ్మ పేలి .. కోమాలోకి వెళ్లిన ఏడేళ్ల బాలిక
X
ప్రాణాల మీదకు తెచ్చిన టిక్ టాక్ రీల్.

టిక్ టాక్ రీల్స్ అనుకరిస్తూ కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. చేయకూడని పనులు చేసి ప్రమాదాల బారిన పడుతున్నారు. మరీ ముఖ్యంగా పిల్లల విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే పిల్లల ప్ర్రాణాలు రిస్క్ లో పడటం ఖాయం. టిక్ టాక్ రీల్ అనుకరిస్తూ ఏడేళ్ల బాలిక ప్రమాదం బారిన పడింది. కోమాలోకి వెళ్లింది. అమెరికాలో ఈ ఘటన జరిగింది.

ఆ పాప పేరు స్కార్లెట్ సెల్బీ. వయసు ఏడేళ్లు. మిస్సోరి ఫెస్ట్ కు చెందిన సెల్బీ.. టిక్ టాక్ లో నీడో క్యూబ్(పాపులర్ స్కిషీ టాయ్) ఆకృతిని మార్చే రీల్ చేసింది. ధాన్ని చాలెంజ్ గా తీసుకుంది. రీల్ లో చూపించినట్లే ఆ క్యూబ్ ను తొలుత ఫ్రీజ్ చేసింది. ఆ తర్వాత ఒవెన్ లో ఉంచింది. కాసేపటి తర్వాత దాన్ని బయటకు తీసింది. అంతే, ఒక్కసారిగా నీడో క్యూబ్ పేలిపోయింది. అందులోని వేడి ద్రవం బాలిక ముఖం, ఛాతిపై పడింది. కొంత ద్రవం నోరు, ముక్కులోకి కూడా చేరింది. దాంతో సెల్బీ తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే తల్లిదండ్రులు పాపను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక కోమాలోకి వెళ్లింది. ఈ ఘటనలో బాలికకు కాలిన గాయాలు కూడా అయ్యాయి.

”నా కూతురు బాధతో గట్టిగా కేకలు వేసింది. అది విన్న నేను భయపడిపోయాను. వెంటనే పరిగెత్తుకెని వెళ్లాను. నా కూతురి పరిస్థితి చూసి షాక్ కి గురయ్యాను. ఆమె చర్మం, బట్టల నుండి జిగటగా, మండుతున్న పదార్థాన్ని తొలగించడానికి తీవ్రంగా ప్రయత్నించాను. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించాను. డాక్టర్లు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం నా కూతురు కోమాలోకి వెళ్లిపోయింది” అని సెల్బీ తండ్రి కన్నీటిపర్యంతం అయ్యారు.

ఆ బాధాకరమైన సంఘటన తర్వాత బాలిక తండ్రి.. పిల్లల తల్లిదండ్రులకు కీలక విజ్ఞప్తి చేశారు. వెంటనే తమ ఇళ్లలో ఉన్న నీడో ఉత్పత్తులను బయట పారేయాలని కోరారు. నీడో క్యూబ్ బొమ్మ లోపల ఉన్న పదార్థం వేడి జిగురును పోలి ఉంటుందని, ఇది పేలుడు సమయంలో తీవ్రమైన కాలిన గాయాలకు కారణమవుతుందని ఆయన హెచ్చరించారు. ఈ పదార్థం చర్మాన్ని తాకిన తర్వాత, దానిని తొలగించడం చాలా కష్టమన్నారు. నీడో క్యూబ్ బొమ్మ పిల్లలకు ఎంత మాత్రమూ సురక్షితం కాదన్నారు. తన కూతురికి జరిగిన ప్రమాదం మరొకరికి జరక్కుండా చూసుకోవాలని తల్లిదండ్రులను కోరాడు సెల్బీ తండ్రి.

Tags

Next Story