Virginia Giuffre: ప్రిన్స్ ఆండ్రూపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన గియుఫ్రే ఆత్మహత్య
బ్రిటిష్ రాజకుటుంబ సభ్యుడు ప్రిన్స్ ఆండ్రూపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన వర్జీనియా గియుఫ్రే(41) ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె కుటుంబ సభ్యలు తెలిపారు. అమెరికా మీడియాకు కుటుంబ సభ్యులు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. చాలా ఏళ్లుగా ఆమె ఆస్ట్రేలియాలోని నీర్గాబిలో నివాసం ఉంటోంది. పశ్చిమ ఆస్ట్రేలియాలోని తన పొలంలో మరణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. గుండె బరువుతో ఈ వార్తను తెలియజేస్తున్నట్లు చెప్పారు.
పిన్స్ ఆండ్రూ అలియాస్ డ్యూక్ ఆఫ్ యార్క్‌పై 2021, ఆగస్టులో గియుఫ్రే లైంగిక వేధింపుల కేసు పెట్టింది. ఆండ్రూ తనతో 17 ఏళ్ల వయసు నుంచి లైంగిక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను ఆండ్రూ పదే పదే ఖండిస్తూ వచ్చాడు. కానీ అతడిపై ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు కాలేదు. ఇక 2022, మార్చిలో గియుఫ్రే-ఆండ్రూ కోర్టులో ఒక పరిష్కారానికి వచ్చినట్లు ప్రకటించారు.
ఇక 2025, మార్చి నెలలో ఆమె కారు ప్రమాదానికి గురైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను గియుఫ్రే సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇంకా నాలుగు రోజులు బతకాల్సి ఉందని పేర్కొంది. తనకు మూత్రపిండాల వైఫల్యం వచ్చిందని రాసుకొచ్చింది. 8 ఎనిమిది రోజుల తర్వాత డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లింది. ఇంతలోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆత్మహత్యకు గల కారణాలేంటో తెలియజేయలేదు.
ఇక గియుఫ్రే ఫ్లోరిడాలో పెరిగింది. చిన్నతనంలోనే కుటుంబ స్నేహితుడి చేతిలో వేధింపులకు గురైనట్లు గతంలో చెప్పింది. దీని కారణంగా యుక్తవయసులో కొన్నిసార్లు వీధుల్లో ఉండాల్సిన పరిస్థితి దాపురించిందని ఆమె చెప్పుకొచ్చింది. గియుఫ్రే మరణంపై ఆమె వ్యక్తిగత లాయర్, స్నేహితులు సంతాపం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com