అంతర్జాతీయం

'అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించబోతున్నా' : జో బైడెన్‌

స్పష్టమైన మెజారిటీతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించబోతున్నానని... డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్‌ ప్రకటించారు. ఎన్నికల ఫలితాలు తుది..

అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించబోతున్నా : జో బైడెన్‌
X

స్పష్టమైన మెజారిటీతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించబోతున్నానని... డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్‌ ప్రకటించారు. ఎన్నికల ఫలితాలు తుది అంకానికి చేరిన వేళ... జో బైడెన్‌ జాతినుద్దేశించి ప్రసంగించారు. 40 లక్షల మెజారిటీతో... భారీ విజయాన్ని సొంతం చేసుకోబోతున్నట్టు బైడెన్‌ తెలిపారు. కనీసం 300 ఎలక్టోరల్‌ కాలేజ్‌ ఓట్లు లభిస్తాయని బైడెన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం విజయం ముందున్న మనం... శాంతియుతంగా ఉండాలని... పిలుపునిచ్చారు. అమెరికా అంతా తమ పార్టీ అద్భుత ప్రదర్శన ఇచ్చిందన్నారు జై బైడెన్‌

విజేత ఎవరో ఈ రోజు దాదాపు ఖరారు అయ్యే అవకాశాలున్నాయి. జార్జియా, పెన్సిల్వేనియా, నెవడాలో.. బైడెన్ ఆధిక్యం కొనసాగుతోంది. వీటిలో ఏ ఒక్కటి గెలిచినా... బైడెన్‌ విజయం సాధించినట్లే. అయితే.. ట్రంప్‌ చేయాలనుకుంటున్న న్యాయపోరాటం బైడెన్‌ గెలుపు ప్రకటనను కాస్త ఆలస్యం చేయొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Next Story

RELATED STORIES