బంగారం, వెండి ధరలు పతనం..

విదేశీ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పతనమయ్యాయి. అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ సెలవుల నేపథ్యంలో డాలర్ బలహీనపడగా.. ఆ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లోని బంగారం కొనుగోళ్లపై పడింది. పసిడి ధర తగ్గడంతో వెండి ధర కూడా అదే బాటలో కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్లో శనివారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.180 తగ్గి రూ.49,580కి చేరింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచి రూ.160 తగ్గుదలతో రూ.45,450కి పడిపోయింది.
వెండి ధర రూ.100తగ్గి కిలోకు రూ.64,700 పలుకుతోంది. పరిశ్రమ యూనిట్లు, నాణెపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర పడిపోయింది. 1800 డాలర్ల దిగువకు చేరుకుంది. ఔన్స్ ధర 1.24 శాతం తగ్గుదలతో 1783 డాలర్లకు పడిపోయింది. ఇక వెండి ధర కూడా ఔన్స్‌కు 2.92 శాతం తగ్గుదలతో 22.69 డాలర్లకు క్షీణించింది. బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. వీటిలో ప్రధానంగా ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ వంటి అంశాలతో పాటు కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com