Dog chews passport: పాస్పోర్ట్ ను పెడిగ్రీలా నమిలేసిన కుక్క..

Dog chews  passport:  పాస్పోర్ట్ ను పెడిగ్రీలా నమిలేసిన కుక్క..
10 రోజుల్లో పెళ్లి.. పాస్పోర్ట్ అధికారుల చుట్టూ తిరుగుతున్న పెళ్ళికొడుకు..

ఒక్కసారి కొన్ని విషయాలు భలే ఆసక్తికరంగా ఉంటాయి.. రాసిపెట్టి ఉంటే ఏదైనా జరుగుతుంది లేకుంటే లేదు అన్నమాటకి ఉతమిచ్చేలా అనిపిస్తాయి.. అలాంటి ఓ సంఘటన అమెరికాలో జరిగింది.పీటల మీద ఆగిపోయే పెళ్లిళ్లను సినిమాల్లో చాలాసార్లు చూసాం. ఇక నిజజీవితంలో పెళ్లిళ్లు ఆగిపోవడానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి అవి కూడా మనకు తెలుసు. కానీ ఈ ఘటనలో మాత్రం పెంపుడు కుక్క కారణంగా ఓ వ్యక్తి పెళ్లి రద్దు అయ్యే పరిస్థితి తలెత్తింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. ఇంతకీ ఆ కుక్క ఏం చేసిందంటే వేరే దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ రెడీ అయిన పాస్‌పోర్టును నమిలి తినేసింది. దీంతో ఆ వ్యక్తి ప్రస్తుతం అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు.


అమెరికాకు చెందిన డొనాటో ఫ్రాట్టరోలిస్ కి మాగ్దా మజ్రీస్ అనే యువతితో పెళ్లి కుదిరింది. వారు ఈ పెళ్లిని ఇటలీలో చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె తో పాటూ పెళ్లికి హాజరయ్యే బంధువులు, స్నేహితులు కూడా పాస్‌పోర్టులు, వీసాలు, టికెట్లు సిద్ధం చేసుకున్నారు. అయితే వరుడు.. పెళ్లికి సంబంధించిన కొన్ని పనుల కోసం ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. అయితే అదే సమయంలో డొనాట్ ఫ్రాట్టరోలిస్‌ పెంచుకుంటున్న కుక్క ఇంట్లోని టేబుల్‌ మీద పెట్టిన పాస్‌పోర్టును ఆ నమిలి తినేసింది. ఇంటికి వచ్చిన తరువాత డొనాట్ ఫ్రాట్టరోలిస్‌, అతని కుటుంబ సభ్యులు చెరిగిపోయిన పాస్పోర్ట్ చూసి షాక్ అయ్యారు. మరో పది రోజుల్లో పెళ్లి పెట్టుకుని.. ఇప్పుడు పాస్‌పోర్టు కుక్క నమిలేయడంతో ఏం చేయాలో అర్థం కాక వెంటనే పాస్‌పోర్టు ఆఫీస్‌కు వెళ్లి జరిగిన విషయం మొత్తాన్ని అక్కడి అధికారులకు వివరించాడు. తనకు పెళ్లి నిశ్చయమైందని.. ఆగస్టు 31 నఇటలీలో జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నట్లు చెప్పాడు. ప్రత్యామ్నాయం చూపించాలని వారిని అభ్యర్థించాడు. లేదంటే తాను లేకుండానే తనకు కాబోయే భార్యతో పాటు కుటుంబం, బంధువులు అందరూ ఇటలీకి వెళ్లిపోతారని అధికారులకు మొర పెట్టుకున్నాడు.

డొనాట్ ఫ్రాట్టరోలిస్‌ సమస్యపై అమెరికా చట్టసభ సభ్యులు లించ్‌, మార్కీ పాస్‌పోర్టు కార్యాలయాలు స్పందించాయి. త్వరలోనే పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చాయి. తన పాస్‌పోర్టు సమస్య వీలైనంత తొందరగా పరిష్కారం అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశాడు డొనాట్. మనం కూడా అదే కోరుకుందాం.

Tags

Read MoreRead Less
Next Story