బాత్రూమ్ కూడా బంగారమే.. బాబు బా..గా సంపాదించాడు..!!

బాత్రూమ్ కూడా బంగారమే.. బాబు బా..గా సంపాదించాడు..!!
రష్యాలోని ట్రాఫిక్ వ్యవస్థ విభాగంలో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణంలో 35మందికి పైగా అధికారులు చేతివాటం ప్రదర్శించారట.

రష్యాలోని ట్రాఫిక్ వ్యవస్థ విభాగంలో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణంలో 35మందికి పైగా అధికారులు చేతివాటం ప్రదర్శించారట. కేసు దర్యాప్తులో భాగంగా కల్నల్ అలెక్సీ సఫోనోవ్ అనే ఉన్నతాధికారి ఇంటికి సోదాలకు వెళ్లినప్పుడు అధికారులు షాక్ తిన్నారు. అక్కడ బెడ్రూమ్‌, హాలు, కిచెన్‌లోని పలు వస్తువులతోపాటుగా చివరికి బాత్రూమ్ కూడా బంగారంతోనే కట్టించుకున్నాడు.

దానికి మ్యాచింగ్‌గా ఫ్లోర్​ను కూడా ప్రత్యేక మార్బుల్‌‌‌తో వేయించాడు. ఆ ఇంటి ముందు రెండు ఖరీదైన కార్లు ఉన్నాయి. దర్యాప్తు బృందం ఆ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో తీసిన 50 సెకెన్ల నిడివిగల వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌‌‌‌లో హల్‌‌‌చల్​ చేస్తోంది. ఇప్పటివరకు ఈ వీడియోను 4 లక్షల మందికి పైగా వీక్షించారు. అలెక్సీ సఫోనోవ్ అనే అధికారి కింద ఉండే మరో ఆరుగురు అధికారులు పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుని వాహనాలకు ఫేక్​ పర్మిట్లు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

దీంతో ఆయా వాహనాలు స్టావ్రోపోల్‌‌లో ఎలాంటి రుసుము చెల్లించకుండా సరుకు రవాణా చేయవచ్చు. దీనితోవారు భారీగా అవినీతికి పాల్పడ్డారని కేసు నమోదైంది. ఈ కేసులో మరో 35 మంది పైన అనుమానాలున్నాయి. కాగా ఈ కేసులో అలెక్సీకి దాదాపుగా 15ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

Tags

Next Story