H1B Visa: భారత్ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్న వలసదారులు

అమెరికా వలస విధానాల్ని మరింత కఠినతరం చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు వలసదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. స్వదేశానికి వెళ్తే.. తిరిగి అమెరికాకు రానిస్తారా? లేదా? అన్నదానిపై హెచ్1బీ వీసాదారులలో అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి ప్రఖ్యాత టెక్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. తమ కంపెనీల్లో పనిచేస్తున్న హెచ్1బీ వీసాదారులను అప్రమత్తం చేస్తూ.. దేశాన్ని వీడొద్దని సూచించాయి.
దీంతో భారత్ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నట్టు పలువురు హెచ్1 బీ వీసాదారులు చెప్పినట్టు ‘వాషింగ్టన్ పోస్ట్’ కథనం పేర్కొంది. అమెరికా పౌరులు మినహా, మిగతా అందరూ అక్రమ వలసదారులే అన్న భావన ప్రస్తుతం అక్కడ నెలకొని ఉందని భారతీయ వలసదారులు చెబుతున్నారని వార్తా కథనం తెలిపింది. దీంతో తాము ఎక్కడికి వెళ్లినా అవసరమైన పత్రాలన్నీ తమ వెంట తీసుకెళ్తున్నామని చెప్పారు. ఈ మేరకు ఇప్పటికే భారత ఎంబసీ అధికారులు కూడా ఎన్నారైలను అప్రమత్తం చేశాయి. అమెరికా పౌరులు మినహా, మిగతా అందరూ అక్రమ వలసదారులే అన్న భావన అక్కడ నెలకొని ఉందని భారతీయ వలసదారులు చెబుతున్నారు. దీంతో తాము ఎక్కడికి వెళ్లినా అవసరమైన పత్రాలన్నీ వెంట తీసుకెళ్తున్నామని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com