Google office: గూగుల్ ఆఫీస్ లో నల్లుల బెడద .. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్!..!

న్యూయార్క్ లోని గూగుల్ ఆఫీస్ తాత్కాలికంగా మూతపడింది. ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం చేయాలని మెయిల్ పెట్టింది. దీనికి కారణం నల్లుల బెడదని కంపెనీ పేర్కొంది. ఆఫీసులో నల్లుల బెడదను పరిష్కించే వరకు ఆఫీసుకు రావద్దని సూచించింది. మన్ హట్టన్ చెల్సియా క్యాంపస్ లోని ఆఫీసులో ఇటీవల నల్లుల బెడద పెరిగిపోయిందని, వాటిని నిర్మూలించేందుకు ఆఫీసును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 19న ఆఫీసును మూసివేసి నల్లుల నివారణకు చర్యలు చేపట్టింది. సోమవారం నుంచి ఆయా ఉద్యోగులు తిరిగి కార్యాలయానికి వచ్చేందుకు అనుమతినిచ్చింది.
ఉద్యోగులలో ఎవరికైనా దురద లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే తెలియజేయాలని కంపెనీ తన మెయిల్ చేసింది. పనిచేసే ప్రాంతంలో ఎక్కడైనా నల్లులు కనిపిస్తే తెలపాలని పేర్కొంది. ఆఫీసులో పెద్ద సంఖ్యలో జంతువుల బొమ్మలు ఉంచడం వల్లే నల్లులు వ్యాపించి ఉండవచ్చని కార్యాలయ వర్గాలు తెలిపాయి. కాగా, 2010లో కూడా ఇదేవిధంగా నల్లుల బెడదతో గూగుల్ ఆఫీసు తాత్కాలికంగా మూతపడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com