భారత్‌లో గూగుల్‌ భారీ పెట్టుబడులు

భారత్‌లో గూగుల్‌ భారీ పెట్టుబడులు
భారత్‌లో గూగుల్‌ 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి... గుజరాత్‌లో గ్లోబల్ ఫిన్‌టెక్ ఆపరేషన్ సెంటర్‌.. ప్రధాని మోడీతో భేటీ అనంతరం సుందర్‌ పిచాయ్‌ ప్రకటన..

ప్రధాని మోడీతో కీలక భేటీ అనంతరం... ప్రపంచ దిగ్గజ టెక్‌ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. భారత్‌లో పెట్టుబడులకు ఇప్పటికే ఎలాన్‌ మస్క్‌ సంసిద్ధత వ్యక్తం చేయగా..తాజాగా అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ కూడా ఆ దిశగా హామీనిచ్చాయి. అమెరికాలో చారిత్రత్మాక పర్యటన చేస్తున్న ప్రధాని మోదీని కలవడం చాలా గౌరవంగా భావిస్తున్నానని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ అన్నారు. భారత్‌లో గూగుల్‌ భారీ పెట్టుబడులుభారత డిజిటలైజేషన్ ఫండ్‌లో గూగుల్ 10 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుందన్న విషయాన్ని ప్రధాని మోదీతో పంచుకున్నట్లు తెలిపారు. తాము ఈ రంగంలో భారత్‌లో పెట్టుబడులను కొనసాగిస్తామన్న పిచాయ్‌... ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై కూడా గూగుల్‌ పని చేస్తుందని తెలిపారు. గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో గ్లోబల్ ఫిన్‌టెక్ ఆపరేషన్ సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్లు కూడా ప్రకటించారు. ప్రధాని మోదీ ముందు చూపుపై పిచాయ్‌ ప్రశంసల వర్షం కురిపించారు. డిజిటల్ ఇండియా దిశగా ప్రధాని మోదీ ముందు చూపు ప్రస్తుత కాలం కంటే చాలా ముందుందని ప్రశంసలు కురిపించారు. ఇతర దేశాలు భవిష్యత్తులో చేయాలనుకుంటున్న బ్లూప్రింట్‌ను తాను ఇప్పుడే ప్రధాని మోడీ దగ్గర చూస్తున్నానని సుందర్‌ పిచాయ్‌ కొనియాడారు.

Tags

Read MoreRead Less
Next Story