Graça Machel: గ్రాకా మాచెల్‌కు ఇందిరా గాంధీ శాంతి బహుమతి

మొజాంబికన్ మానవ హక్కుల కార్యకర్త గ్రాకా మాచెల్‌కు 2025 సంవత్సరానికి ఇందిరా గాంధీ శాంతి, నిరాయుధీకరణ, డెవలప్ మెంట్ బహుమతిని ప్రదానం చేయనున్నట్లు జ్యూరీ బుధవారం ప్రకటించింది. మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ నేతృత్వంలోని అంతర్జాతీయ జ్యూరీ, క్లిష్ట పరిస్థితుల్లో విద్య, ఆరోగ్యం, పోషకాహారం, ఆర్థిక సాధికారత, మానవతావాద సేవలలో ఆమె చేసిన అత్యుత్తమ కృషికి గాను మాచెల్‌ను ఎంపిక చేసిందని ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ తెలిపింది. ఈ బహుమతి ప్రతియేటా ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ వారిచే అంతర్జాతీయ శాంతి, అభివృద్ధి, నూతన ఆర్థిక విధానాలు మొదలైన రంగాలలో కృషి చేసిన వ్యక్తులకు లేదా సంస్థలకు ప్రదానం చేస్తారు.
ఇందిరా గాంధీ శాంతి, నిరాయుధీకరణ, డెవలప్ మెంట్ ప్రైజ్.. రూ. 1 కోటి బహుమతి, ఒక ట్రోఫీతో పాటు ప్రశంసాపత్రాన్ని కలిగి ఉంటుంది. మాచెల్ ఒక విశిష్ట ఆఫ్రికన్ రాజనీతిజ్ఞురాలు, రాజకీయవేత్త మానవతావాది, ఆమె జీవితాంతం స్వయం పాలన, మానవ హక్కుల రక్షణ కోసం పోరాటంలో అంకితమయ్యారని ప్రకటన పేర్కొంది. మాచెల్ 1986లో మరణించిన మొజాంబిక్ మొదటి అధ్యక్షురాలు సమోరా మోయిసెస్ మాచెల్‌ను వివాహం చేసుకున్నారు. తరువాత, ఆమె దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాను వివాహం చేసుకుంది. గ్రాకా అక్టోబర్ 17, 1945న జన్మించారు. ఆమె లిస్బన్ విశ్వవిద్యాలయంలో జర్మన్ అధ్యయనం చేయడానికి స్కాలర్‌షిప్ పొందారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
