US H1B Visa News: H1B వీసా హోల్డర్స్‌కు గుడ్ న్యూస్.. గ్రేస్ పీరియడ్ పొడిగించారోచ్..

US H1B Visa News: H1B వీసా హోల్డర్స్‌కు గుడ్ న్యూస్.. గ్రేస్ పీరియడ్ పొడిగించారోచ్..
US H1B Visa News: ఆరంకెల జీతం.. అమెరికాలో ఉద్యోగం.. జామ్ అంటూ ఫ్లైటెక్కేసి హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటుంటే కరోనా వచ్చి కాలితో తన్నింది.

US H1B Visa News: ఆరంకెల జీతం.. అమెరికాలో ఉద్యోగం.. జామ్ అంటూ ఫ్లైటెక్కేసి హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటుంటే కరోనా వచ్చి కాలితో తన్నింది.అంతే అప్పటి నుంచి ఎవరి ఉద్యోగం ఉంటుందో, ఊడుతుందో తెలియని పరిస్థితి. ఏదో పక్క ఊరు కాదో.. ఉద్యోగం పోయిందని పెట్టేబేడా సర్ధుకుని వచ్చేయడానికి.. ఖండాలు దాటి రావాలి. అది అంత తేలికైన విషయం కాదు. దానికి బోలెడంత ప్రాసెస్.. ఇలాంటి సమయంలో అక్కడ ఉండేందుకు కేటాయించిన H1B వీసా గ్రేస్ పీరియడ్ పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయం నిజంగా ప్రాణం లేచి వచ్చినట్లైంది అక్కడ ఉన్న స్థానికేతరులకు.

H1B వీసాదారులకు గ్రేస్ పీరియడ్‌ను ప్రస్తుతం ఉన్న 60 రోజుల నుండి 180 రోజులకు పొడిగించాలని ప్రెసిడెన్షియల్ అడ్వైజరీ సబ్‌కమిటీ ఫెడరల్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. గత రెండు నెలల్లో మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా మరియు అమెజాన్, ట్విటర్‌తో సహా అనేక టెక్ కంపెనీల్లో ఉద్యోగం కోల్పోయిన చాలా మంది H1B వీసా హోల్డర్లు 60 రోజుల వ్యవధిలో మరొక కంపెనీలో ఉద్యోగం వెతుక్కోవడం కొంచెం ఇబ్బందిగా మారింది. కొత్త ఉపాధి అవకాశాలను వెతుక్కునే ప్రక్రియలో ఈ పొడిగింపు బాధిత ఉద్యోగులకు కొంత ఊరటను అందిస్తుంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్ మరియు అమెజాన్ వంటి కంపెనీలలో గత ఏడాది నవంబర్ నుండి దాదాపు 200,000 మంది ఐటి ఉద్యోగులు తొలగించబడ్డారని వాషింగ్టన్ పోర్ట్ నివేదించింది.

Tags

Read MoreRead Less
Next Story