Grammy 2023: ముచ్చటగా 32వ సారి...

గ్రామీ 2023 పురస్కారాల ప్రధానోత్సవం అంగరంగవైభవంగా ముగిసింది. ఈసారి వేడుకలో నల్లజాతీయుల హవానే కనిపించింది అనడంలో అతిశయోక్తి లేదు. మరోవైపు ఎల్జీబీటీ కమ్యునిటీ సైతం చెప్పుకోదగిన విధంగానే తన ప్రభావం చూపింది. ముఖ్యంగా పాప్ క్వీన్ బియాన్సీ స్పీచ్ లో ఎల్జీబీటీ కమ్యునిటీ గురించి ప్రస్తావించడంతో ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది. తన కెరీర్ లో 32వ గ్రామీని సొంతం చేసుకున్న బియాన్సీ... జార్జ్ సోల్టీ రికార్డ్ ను బ్రేక్ చేసి కొత్త రికార్డ్ ను నెలకొల్పింది. తన పాటల ద్వారా బాలికలు, మహిళల హక్కుల గురించి ప్రచారం చేసేందుకు ప్రధాన్యతను ఇచ్చే ఈ పాప్ క్వీన్... రన్ ద వరల్డ్(Run the world grils) వంటి పాటలతో వారిని ఉత్తజపరుస్తూ ఉంటుంది. ఇక తన 32వ గ్రామీని అందుకున్న తరువాత సభను ఉద్దేశించి ప్రసంగించిన బియాన్సీ.. క్వీర్ కమ్యునిటీకి కృతజ్ఞతలు తెలియజేసింది. వారు అందించిన అపారమైన ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటానని ప్రసంగించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com