గ్రాఫేన్ మాస్క్.. 100 శాతం వైరస్ నుంచి రక్షణ

గ్రాఫేన్ మాస్క్.. 100 శాతం వైరస్ నుంచి రక్షణ
మాస్క్ తయారీ కోసం పరిశోధకులు లేజర్ ప్రేరిత గ్రాఫేన్ రూపాన్ని అభివృద్ధి చేశారు.

బ్యాక్టీరియా నిరోధక సామర్థ్యం 80 శాతం ఉన్న గ్రాఫేన్‌తో తయారు చేసిన మాస్కును హాంకాంగ్‌లోని సిటీ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు అభివృద్ధి చేసినట్లు అమెరికన్ కెమికల్ సొసైటీ నానో పత్రిక ప్రచురించింది. ఈ మాస్కును 10 నిమిషాలు సూర్యరశ్మిలో ఉంచితే పూర్తి సామర్థ్యాన్ని కలిగిఉంటుందని వారు తెలిపారు. గ్రాఫెన్ మాస్క్ పై వారు చేసిన పరిశోధనలు రెండు కరోనా వైరస్ జాతులకు వ్యతిరేకంగా మంచి ఫలితాలను చూపించాయని పరిశోధకులు పేర్కొన్నారు. గ్రాఫేన్ మాస్క్‌లు తక్కువ ఖర్చుతో సులభంగా ఉత్పత్తి అవుతాయని, బయోడిగ్రేడబుల్ కాని మాస్క్ లను పారవేయడం వంటి సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయని పరిశోధకులు తమ నివేదికలో పేర్కొన్నారు.

మాస్క్ తయారీ కోసం పరిశోధకులు లేజర్ ప్రేరిత గ్రాఫేన్ రూపాన్ని అభివృద్ధి చేశారు. బ్యాక్టీరియా సంక్రమణకు కారణమయ్యే వ్యాధికారక ఇ కోలి బ్యాక్టీరియా పై పరీక్షలు జరిపారు. గ్రాఫేన్ యొక్క యాంటీ బాక్టీరియల్ సామర్థ్యం 82 శాతంగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. గ్రాఫేన్ ఉపరితలంపైకి చేరిన ఇ కోలిలో ఎక్కువ భాగం ఎనిమిది గంటల తర్వాత చనిపోయాయి. కరోనావైరస్ జాతులపై ప్రారంభ పరీక్షలలో గ్రాఫేన్ ఐదు నిమిషాల్లో 90 శాతం వైరస్ ని నిర్వీర్యం చేయగలిగింది. అదే సూర్యకాంతిలో ఉంచిన మాస్క్ అయితే 100 శాతం కరోనాను ఎదుర్కొనగలిగిందని పరిశోధనలో వెల్లడైంది. గ్రాఫేన్ మాస్క్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు మరిన్ని వైద్య బృందాలు సమాయత్తమవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story