గ్రీస్ లో పడవ ప్రమాదం. 79 మంది జలాసమాధి

గ్రీస్ తీరంలో దారుణం జరిగింది. పొట్ట చేత పట్టుకుని యూరోప్ వెళ్లిపోయేందుకు ప్రయత్నించిన వలసదారులు ప్రయాణిస్తున్న పడవ మెడిటెర్రేనియన్ సముద్రంలో బోల్తాపడింది. దీంతో 79 మంది ప్రాణాలు కోల్పోగా, డజన్లకొద్దీ జనం జాడ గల్లంతయ్యింది. కోస్ట్‌గార్డ్, నావికా దళం, మర్చంట్ నౌకలు, విమానాల ద్వారా సహాయక, గాలింపు చర్యలు జరుగుతున్నాయి.పెలోపోన్నీస్ ప్రాంతం నుంచి తీరానికి 75 కిలోమీటర్లదూరంలో సముద్రంలో జరిగిన ఈ దుర్ఘటనలో ఇప్పటికే 104 మంది కాపాడామని అధికారులు తెలిపారు.
నీలం రంగులో ఉన్న పడవలో కనీసం ఓ అంగుళం అయినా ఖాళీ లేకుండా ప్రయాణికులు ఉన్నట్లు ఉన్న ఒక ఫొటోను గ్రీక్ కోస్ట్ గార్డ్ విడుదల చేసింది. దీంతో ఈ పడవలో 500 మందికిపైగా ప్రయాణించి ఉండవచ్చునని సమాచారం.ఈ ప్రమాదంలో మరణించినవారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మూడు రోజులపాటు జాతీయ సంతాప దినాలుగా గ్రీస్ ఆపద్ధర్మ ప్రధాన మంత్రి ఐయన్నిస్ సర్మస్ ప్రకటించారు. బాధితులకు సంఘీభావం ప్రకటించారు.ఆరు తీర గస్తీ నౌకలు, ఒక నావికాదళ యుద్ధనౌక, ఒక సైనిక రవాణా విమానం, వాయుసేన హెలికాప్టర్, ఇంకా కొన్ని ప్రైవేట్ పడవలు, డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలను భారీ ఎత్తున కొనసాగిస్తున్నారు.
మెడిటెర్రేనియన్ సముద్రం 17000 అడుగుల లోతు ఉన్నప్రాంతంలో ఈ సంఘటన జరిగినందు వల్ల సహాయక చర్యలకు ఆటంకాలు కలుగుతున్నాయి. గ్రీస్ ని దాటుకొని ఇటలీ చేరుకునేందుకు స్మగ్లర్లు ఎక్కువగా ఈ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటలీకి చెందిన పడవ తూర్పు లిబియా లోని తోబ్రాక్ నుంచి వలసదారులతో బయలుదేరినట్టు అనుమానిస్తున్నారు. దీంతో ఇటలీ కోస్ట్ గార్డు ముందుగానే గ్రేస్ అధికారులతో పాటు యూరోపియన్ యూనియన్ సరిహద్దు రక్షణ ఏజెన్సీలను అక్రమసం చేసింది. అయితే అనుకోకుండా భారీగాలు నువ్వే చేయడంతో పడవ ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com