అప్పుడు నన్ను అన్నారు కదా.. ఇప్పుడు అవే మీకు రిటన్ ఇస్తున్నా: ట్రంప్‌పై ట్వీట్ చేసిన గ్రెటా

అప్పుడు నన్ను అన్నారు కదా.. ఇప్పుడు అవే మీకు రిటన్ ఇస్తున్నా: ట్రంప్‌పై ట్వీట్ చేసిన గ్రెటా
ఇప్పటికే 1.3 మిలియన్ల మంది లైక్ చేయగా. లక్షలాది మంది రీట్వీట్ చేశారు.

అమెరికా అధ్యక్ష పదవికి మరోసారి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ గెలుపొందే అవకాశాలు సన్నగిల్లడంతో 'స్టాప్ ది కౌంట్' అని ట్వీట్ చేశారు.. అది కాస్తా విమర్శలకు దారి తీయడంతో ఓటమి భయంతోనే ఇలా మాట్లాడుతున్నారని నెటిజన్లు ఆయనపై సెటైర్లు వేస్తున్నారు. ఇక ఇదే విషయమై స్వీడన్‌కు చెందిన పర్యావరణ ప్రచారకురాలు గ్రెటా థన్‌బర్గ్ (17) కూడా ట్రంప్‌పై సెటైరికల్ ట్వీట్ చేశారు.

చిల్ డొనాల్డ్ చిల్ అంటూ సెటైర్ వేశారు. చాలా హాస్యాస్పదం. డొనాల్డ్ యాంగర్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించాలి. ఇందుకోసం స్నేహితుడితో కలిసి ఏదైనా మంచి పాత ఫ్యాషన్ సినిమాకు వెళ్లండి.. చిల్ డొనాల్డ్ చిల్ అంటూ గ్రెటా గురువారం ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ అయింది.. ఇప్పటికే 1.3 మిలియన్ల మంది లైక్ చేయగా. లక్షలాది మంది రీట్వీట్ చేశారు.

అయితే గ్రెటా.. ట్రంప్‌కు ఆ విధంగా ట్వీట్ చేయడానికి ఓ కారణం ఉంది.. 2019లో గ్రెటాను టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అని పేర్కొంటూ ఆమె ఫోటోను కవర్ పేజీపై ముద్రించింది. దానికి ట్రంప్ " ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది.. గ్రెటా.. నువ్వు యాంగర్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించాలి. ఇందుకోసం స్నేహితుడితో కలిసి ఏదైనా మంచి పాత ఫ్యాషన్ సినిమాకు వెళ్లండి! చిల్ గ్రెటా, చిల్!'' అంటూ ట్రంప్ అప్పుడు ఆమెకు ట్వీట్ చేశారు.

ట్రంప్ అన్న మాటల్ని తిరిగి ఎప్పుడు ఆయనకు అప్పజెప్పాలా అని అవకాశం కోసం ఎదురు చూస్తున్న గ్రెటాకు అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేక స్టాప్ ది కౌంట్ అని అనడం గ్రెటాకు కలిసొచ్చింది.. ఇదే సమయని భావించింది. తనపై విమర్శనాస్త్రాలు సంధించిన ట్రంప్‌కు మళ్లీ అవే మాటలు తిరిగి అప్పజెప్పింది. దీంతో నెటిజన్లు ఆమె సమయస్ఫూర్తికి మెచ్చుకుంటూ ట్వీట్లు పెడుతున్నారు. గ్రెటా ట్వీట్‌ను రీట్వీట్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story