The Guardian: ‘ఎక్స్‌’ను బహిష్కరించిన బ్రిటిష్‌ మీడియా సంస్థ

The Guardian: ‘ఎక్స్‌’ను బహిష్కరించిన బ్రిటిష్‌ మీడియా సంస్థ
X
మాజీ సిఎన్ఎన్ యాంకర్ డాన్ లెమన్ కూడా

ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఎక్స్ నుండి వైదొలగుతున్నట్లు బ్రిటిష్ వార్తా ప్రచురణకర్త గార్డియన్ బుధవారం తెలిపింది. జాత్యహంకారం, కుట్ర సిద్ధాంతాలతో సహా “అంతరాయం కలిగించే కంటెంట్”ను ఎక్స్ లో అనుమతి ఇస్తునందుకు ఇకపై ఎక్స్ లో పోస్ట్ చేయమని గార్డియన్ పేర్కొంది. ఎక్స్ లో 10.7 మిలియన్ల మంది ఫాలోయర్స్ ఉన్న లెఫ్ట్-లీనింగ్ గార్డియన్… 2022లో ఎలోన్ మస్క్ కొనుగోలు చేసిన ప్లాట్‌ఫారమ్ నుండి వైదొలిగిన మొదటి పెద్ద యుకే మీడియా కంపెనీగా అవతరించింది. అబద్ధాలు, ద్వేషపూరిత ప్రసంగాలను వ్యాప్తి చేయడానికి అనుమతిస్తున్న మస్క్ విధానాలపై గతంలో విమర్శకులు మండిపడ్డారు. “ఎక్స్‌లో ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు ప్రతికూలతల కంటే ఎక్కువగా ఉన్నాయని మేము భావిస్తున్నాము. ఇతర చోట్ల మా జర్నలిజాన్ని ప్రోత్సహించడానికి వనరులను బాగా ఉపయోగించవచ్చని మేము భావిస్తున్నాము” అని గార్డియన్ తన వెబ్‌సైట్‌లో ప్రచురించిన సంపాదకీయంలో పేర్కొంది.

మరోవైపు మాజీ సిఎన్ఎన్ యాంకర్ డాన్ లెమన్ కూడా మస్క్ యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను విడిచిపెడుతున్నట్లు ఆయన బుధవారం ఎక్స్ లో ఒక పోస్ట్‌ ద్వారా ప్రకటించారు. ఒకప్పుడు ఇది నిజాయితీతో కూడిన చర్చ, పారదర్శకత మరియు వాక్ స్వాతంత్ర్యం కోసం ఒక వేదిక అని నమ్మానని, కానీ ఇప్పుడు అది ఆ ప్రయోజనాన్ని అందించదని తాను భావిస్తున్నానట్లు లెమన్ పేర్కొన్నారు.

Tags

Next Story