Gun Firing : అమెరికాలో మరోసారి కాల్పులు

అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది.ఈస్ట్ లాన్సింగ్‌లోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ మొయిన్ క్యాంపస్‌లోకి ఓ ఆగంతకుడు ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు.ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. దీంతో భయాందోళనకు గురైన విద్యార్థులు, సిబ్బంది వెంటనే గదుల్లోకి పారిపోయారు. కాల్పుల అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయినట్లు యూనివర్సిటీ సిబ్బంది తెలిపారు.
నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అమెరికాలో అతిపెద్ద ఉన్నత విద్యాసంస్థల్లో మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ ఒకటి. కాల్పులు జరిగిన ఈస్ట్ లాన్సింగ్ క్యాంపస్‌లో 50వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.ఈ ఘటన నేపథ్యంలో 48 గంటల పాటు క్యాంపస్‌లో అన్ని తరగతులు, ఇతర కార్యకలాపాలను రద్దు చేసినట్లు యూనివర్సిటీ పోలీసులు తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com