Gun Firing : పుట్టినరోజు వేడుకల్లో కాల్పులు, 8మంది మృతి

Gun Firing : పుట్టినరోజు వేడుకల్లో కాల్పులు, 8మంది మృతి
పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరపారు


పుట్టిన రోజు వేడుకల్లో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 8మంది మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన సౌతాఫ్రికాలోని ఈస్టర్ కాప్ ప్రోవిన్స్ లో జరిగింది. ఇద్దరు గుర్తుతెలియని దుండగులు సామూహికంగా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు కాల్పులు జరిపి పారిపోయినట్లు చెప్పారు. కాల్పులకు గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సౌతాఫ్రికా గేబెర్హా, క్వజకేల్ లోని ఓ ఇంట్లో పుట్టిన రోజు వేడుక జరుగుతుంది. అంతలోనే గుర్తుతెలియని ఇద్దరు సాయుధులైన దుండగులు ఇంట్లోకి ప్రవేశించారు. పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరపారు. దీంతో 8మంది అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించారు. నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గతఏడాది జులైలో ముష్కరులు జరిపిన దాడిలో 19మంది మరణించిన విషయం తెలిసిందే.

Tags

Next Story