America: ప్రైవేట్ స్కూల్‌లో కాల్పులు.. విద్యార్థి చేతిలో..

X
America: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చెలరేగింది. టెక్సాస్‌లోని డల్లాస్ పరిధి అర్లింగ్టన్‌లో ఉన్న ఓ పాఠశాలలో ఓ విద్యార్థి కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. విద్యార్థుల మధ్య ఘర్షణ జరగడంతో కాల్పులు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడ ఉన్నవారంతా పారిపోతుండగా నలుగురికి గాయాలు అయ్యాయి. దీంతో బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. మరోవైపు పోలీసులు కాల్పులు జరిపిన విద్యార్థి కోసం గాలింపు చేపట్టి అరెస్టు చేశారు. టింబర్‌వ్యూ పాఠశాలలో మొత్తం 19 వందల మంది విద్యార్థులు చదువుతున్నారు. కాల్పులు చోటుచేసుకోవడంతో ఆందోళన చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాఠశాలకు చేరుకొని తమ పిల్లలను తీసుకెళ్లారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
