USA: అమెరికాలో తుపాకీ మోత

అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. అమెరికాలోని న్యూహాంప్‌షైర్ లోని ఓ హాస్పిటల్ వద్ద దుండుగులు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. శుక్రవారం మధ్యాహ్నాం 3.30గంటల సమయంలో కాంకర్డ్ నగరంలోని సైకియాట్రిక్ ఫెసిలిటీ ‘న్యూహాంప్‌షైర్ హాస్పిటల్’ వద్ద జరిగిన ఘటనలో ఒకరు వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కాల్పుల ఘటనపై సమచారం అందుకున్న పోలీసులు వెంటనే అలెర్ట్ అయ్యారు. హాస్పిటల్ లాబీలో దుండగుడు దాక్కున్నాడని తెలుసుకుని ఆ దిశగా కాల్పులు జరపగా పోలీసుల కాల్పుల్లో సదరు దుండగుడు హతమయ్యాడు. తాము జరిపిన కాల్పుల్లో దుండగుడు చనిపోయాడని పోలీసులు వెల్లడించారు.
అయితే సైకియాట్రిక్ ఫెసిలిటీ ‘న్యూహాంప్‌షైర్ హాస్పిటల్’కు వచ్చేవారంతా మెటల్ డిటెక్టర్ల ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. దీంతో అక్కడ కచ్చితంగా ఓ పోలీసు డ్యూటీలో ఉంటారు. ఈక్రమంలో దుండుగుడు కాల్పులు జరుపగా వెంటనే అలెర్ట్ అయిన పోలీసు ఎదురు కాల్పులు జరిపి పోలీసు సిబ్బందికి సమాచారం అందించటం..వారు వెంటనే రావటంతో పెను ప్రమాదం తప్పింది. ఆస్పత్రిలో రోగులు, సిబ్బంది అందరు సురక్షితంగానే ఉన్నారని తెలిపారు.
అమెరికాలో ఏ పౌరుడి చేతిలో గన్ ఉన్నా అది పిచ్చోడి చేతిలో రాయి లాగే లెక్క..! అయితే గన్‌తో ఆత్మహత్య చేసుకోవడం లేకపోతే అదే గన్‌తో ఇతరుల ప్రాణాలను తీయడం అక్కడ మోస్ట్ కామన్ థింగ్..! ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏ దేశంలోనూ లేనంత తుపాకీ హింస అమెరికాలో ఉందని అంతర్జాతీయ రిపోర్టులు చెబుతున్నాయి. అక్కడ ప్రతిరోజు 110మంది తుపాకీ సంస్కృతికి బలైపోతున్నారు. ఇందులో మర్డర్స్‌తో పాటు సూసైడ్‌లూ ఉన్నాయి. ఏడాదికి సగటున 40,620 మంది ప్రజలు ఈ గన్ కల్చర్‌కు మరణిస్తున్నారట. 2009 నుంచి ఇప్పటివరకు ఏడాదికి సగటున 19 మాస్ షూటింగ్స్ జరుగుతున్నాయట..! ఈ సాముహిక కాల్పుల్లో యావరేజ్‌గా ప్రతి ఘటనకు నలుగురు చొప్పున బలైపోతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అటు తుపాకీ హత్యల రేటు మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇతర అధిక ఆదాయ దేశాలతో పోలిస్తే 26 రెట్లు ఎక్కువగా తుపాకీతో హత్యలు.. 12రెట్లు అధికంగా తుపాకీతో ప్రజలు ఆత్మహత్య చేసుకుంటుండడం అక్కడి దారుణ పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com