18 March 2021 7:09 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / యూట్యూబర్ రిక్వెస్ట్.....

యూట్యూబర్ రిక్వెస్ట్.. మేడమ్ ప్లీజ్ మీ ఉద్యోగం వదిలేసుకోరా.. లక్ష డాలర్లు ఇస్తా!!

డబ్బులు ఊరికేరావు.. ఆ విషయం మాకూ తెలుసు.. ఇంతకీ విషయం ఏంటో చెప్పండి.. కానీ నేను ఊరికే ఇస్తా మేడమ్..

యూట్యూబర్ రిక్వెస్ట్.. మేడమ్ ప్లీజ్ మీ ఉద్యోగం వదిలేసుకోరా.. లక్ష డాలర్లు ఇస్తా!!
X

డబ్బులు ఊరికేరావు.. ఆ విషయం మాకూ తెలుసు.. ఇంతకీ విషయం ఏంటో చెప్పండి.. కానీ నేను ఊరికే ఇస్తా మేడమ్.. ఇందుకోసం మీరు ఏం చేయక్కర్లా.. మీకు ఎంతో ఇష్టమైన, మీకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న ఈ ఉద్యోగాన్ని వదిలేస్తే చాలు..

అయ్యో అలా తిట్టకండి మొత్తం వినండి.. మీరు ఇప్పుడు చేస్తున్న ఈ ఉద్యోగాన్ని వదిలేస్తే లక్ష డాలర్లు ఇస్తా.. ఓకేనా.. ఎన్ని రోజులు కష్టపడితే ఇంత డబ్బు వస్తుంది చెప్పండి.. ఈ డబ్బు తీసుకుని హ్యాపీగా ఇంటికి వెళ్లండి.. ముందు ఆశ్చర్యం, ఆ తరువాత అవాక్కైన మహిళ యూట్యూబర్ ఇచ్చిన లక్ష డాలర్ల చెక్కందుకుని సంతోషంగా ఇంటికి చెక్కేసింది.

ఏం లేకుండా ఎందుకంత ఇచ్చాడు ఆమెకు డబ్బులు అంత ఎక్కువ వున్నాయా ఏంటి అతగాడి దగ్గర అని అందరూ అనుకునే మాటే.. అసలు విషయానికి వస్తే అమెరికాకు చెందిన 22 ఏళ్ల జిమ్మీ డొనాల్డ్‌సన్‌ 'మిస్టర్ బీస్ట్' పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ రన్ చేస్తున్నాడు. ఓ వీడియో చేయడం కోసం కోట్లు ఖర్చుపెడుతుంటాడు.. మరి ప్రజల్లో అంత క్రేజ్ ఉంది ఇతడి వీడియోలంటే..

ప్రజల మధ్య తిరుగుతూ వారికి చిన్న చిన్న టాస్కులు ఇస్తుంటాడు. గెలిచిన వారికి డాలర్ల కొలది డబ్బును బహుమతిగా అందజేస్తుంటాడు. దీంతో అతడిని మిస్టర్ బీప్‌గానే నెటిజన్లు గుర్తుపెట్టుకుంటారు. ఇతడి ఛానెల్‌కి దాదాపు ఐదున్నర కోట్ల మంది సబ్‌స్క్రైబర్ ఉన్నారు. ఇక ఇతడి ఫాలోవర్స్ అంతా కొత్త వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తాడా అని ఎదురు చూస్తుంటారు.

ఇటీవల అతడు అప్‌లోడ్ చేసిన వీడియో ఒకటి ఆసక్తికరంగా మారింది. అందులో ఓ రెస్టారెంట్‌లో పని చేసే ఒక మహిళను ఉద్యోగం వదులుకుంటే లక్ష డాలర్లు (అంటూ సుమారు రూ.73 లక్షలు) ఇస్తానని చెప్పాడు. మొదట ఒప్పుకోలేదు. కానీ ఆఫర్ ఊరించే సరికి ఆమె ఉద్యోగం వదులుకుంది. అలాగే అక్కడ పని చేసే మరో చిరుద్యోగికి పది వేల డాలర్లు అందించాడు.

ఇలానే మరో వీడియోలో ఇంకో టాస్క్.. ఓ అందమైన భవంతికి చెందిన తాళం చెవితో మరి కొన్ని తాళం చెవులు కలిపాడు.. ఇచ్చిన టైంలో భవంతికి చెందిన తాళం చెవిని కనిపెడితే ఆ భవనం సొంతం చేసుకోవచ్చని చెప్పాడు. ఓ వక్తి ఆ టాస్క్‌గెలిచి భవనాన్ని సొంతం చేసుకున్నాడు.

ఓసారి తన కారుకు తానే పంక్చర్ చేసుకుని అటుగా వెళ్లే వాహనదారుల్ని సాయం చేయమని అడిగాడు. ఓ వ్యక్తి వచ్చి టైరు మార్చడంలో సాయం అందించాడు. అంతే అతడికి ఆకారుని అప్పగించేశాడు. పైగా నువ్వు చేసిన సాయం నీకు చిన్నదే కావచ్చు. అది నాకు చాలా పెద్దది అని చెప్పి కారు ఇచ్చి వెళ్లిపోయాడు.

ఇలా అతడు చేసే టాస్కులన్నీ భారీగా ఉంటాయి. అందుకే వ్యూస్ కూడా భారీగానే ఉంటాయి. ఆదాయం కూడా కోట్లలోనే వస్తుంది.. వచ్చినదంతా ఇచ్చేయడంలోనే సంతోషం ఉంటుంది అని చెప్పే జిమ్మీ వీడియోలు మీరూ చూసేయండి.

Next Story