Hage Geingob: నమీబియా అధ్యక్షుడు హేజ్‌ గింగోబ్‌ కన్నుమూత

Hage Geingob: నమీబియా అధ్యక్షుడు హేజ్‌ గింగోబ్‌ కన్నుమూత
కారణమేంటంటే ...

నమీబియా అధ్యక్షుడు హేజ్ గింగోబ్ (82) ఇకలేరు. గత కొన్ని రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న హేజ్.. ఆదివారం తెల్లవారుజామున విండ్‌హోక్‌లోని లేడీ పోహంబా ఆస్పత్రిలో కన్నుమూశారు. నమీబియా అధ్యక్ష కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది. అధ్యక్షుడు హేజ్‌ గింగోబ్‌ మృతిచెందారని సోషల్ మీడియాలో కూడా పోస్ట్‌ చేశారు.

2014లో అస్వస్థతకు గురైన గింగోబ్‌ సాధారణ వైద్య పరీక్షలు చేయించుకోగా ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ సోకినట్లు తేలింది. అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల చికిత్స కోసం యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్తానని కూడా హేజ్ పేర్కొన్నట్లు ప్రెసిడెన్సీ తెలిపింది. మరుసటి సంవత్సరం అధ్యక్షుడయ్యాడు. దక్షిణాఫ్రికా దేశంలో ఈ ఏడాది చివరిలో అధ్యక్ష, పార్లమెంటరీ ఎన్నికలు జరగనున్నాయి. కానీ ఇంతలో ఆయన మరణించారు. దీంతో స్థానిక ప్రజలతోపాటు అనేక మంది ప్రముఖులు హేజ్ గింగోబ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక అధ్యక్షుడు నాంగోలో ఎమ్బుంబా వ్యవహరించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story