ఇజ్రాయెల్ పై హమాస్ దాడులు.. ఒక తండ్రి త్యాగం.. కుటుంబాన్ని తప్పించి..

ఇజ్రాయెల్ పై హమాస్ దాడులు.. ఒక తండ్రి త్యాగం.. కుటుంబాన్ని తప్పించి..
ఉగ్రవాదుల నుండి తప్పించుకోవడానికి కుటుంబానికి సహాయం చేసి అతడు మాత్రం బుల్లెట్ల దాడికి బలయ్యాడు.

ఉగ్రవాదుల నుండి తప్పించుకోవడానికి కుటుంబానికి సహాయం చేసి అతడు మాత్రం బుల్లెట్ల దాడికి బలయ్యాడు. ఇజ్రాయెల్‌లో హమాస్ ఉగ్రవాదులు తమ ఇంటిపై దాడి చేసినప్పుడు అతని కుటుంబ సభ్యులందరినీ కిటికీలోంచి తప్పించాడు. చివరిగా అతడు కూడా కిటికీలో నుంచి దిగి వెళ్లబోతుంటే బుల్లెట్ల వర్షం అతడి మీద కురిసింది. దాంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ఇజ్రాయెలీ జర్నలిస్ట్ హనన్యా నఫ్తాలీ ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో పోస్ట్ చేశారు. వీడియోను పోస్ట్ చేస్తూ అతను ఇలా వ్రాశాడు: “హమాస్ ఉగ్రవాదులు తమ ఇంట్లోకి చొరబడటంతో కిటికీలోంచి తన కుటుంబాన్ని ఒక తండ్రి రక్షించిన హృదయ విదారక వీడియో - నేను ఈ హీరోకి నమస్కరిస్తున్నాను అని పేర్కొన్నారు.

శనివారం తెల్లవారుజాము నుండి దక్షిణ ఇజ్రాయెల్ అంతటా రాడికల్ ఇస్లామిస్ట్ హమాస్ ఉగ్రవాదులు సాగిస్తున్న భయంకరమైన మారణకాండలో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 2 రోజుల్లో 1100 మంది మరణించినట్లు నిర్ధారించబడింది.

శనివారం తెల్లవారుజామున ప్రారంభమైన హమాస్ మిలిటెంట్ల దాడి తర్వాత ఇజ్రాయెల్ మరియు గాజాలో సుమారు 1,100 మంది మరణించినట్లు జాతీయ మీడియా నివేదించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడినందున మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంటుందని ఇజ్రాయెల్ రక్షణ దళాలను ఉటంకిస్తూ మీడియా పేర్కొంది.

ఇజ్రాయెల్‌పై దాడికి ప్లాన్ చేయడానికి హమాస్ ఉగ్రవాదులకు ఇరాన్ సహాయం చేసింది: ఫాక్స్ న్యూస్ "ఇరాన్ ఉగ్రవాద సంస్థ హమాస్ ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడి చేయడానికి సహాయపడిందని నివేదించింది" .

గత సోమవారం బీరూట్‌లో జరిగిన సమావేశంలో ఇరాన్‌ భద్రతా అధికారులు ఇజ్రాయెల్‌పై దాడి చేయాలనే హమాస్ ప్రణాళికను ఆమోదించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఆదివారం నివేదించింది.

ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ వాగ్దానం చేసింది: వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న తమ పౌరుల మృత దేహాలను చూసి కలత చెందిన ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ, ఇజ్రాయెల్ "సుదీర్ఘమైన, కష్టతరమైన యుద్ధాన్ని ప్రారంభించింది" అని చెప్పారు.

యుద్ధం యొక్క మొదటి దశలో ఇజ్రాయెల్‌లోకి చొరబడిన శత్రు దళాలను నాశనం చేయడం ఉంటుంది అని X లో పేర్కొన్నారు. లక్ష్యాలను సాధించే వరకు... మేము ఇజ్రాయెల్ పౌరులకు భద్రతను కల్పిస్తాము. యుద్ధంలో మేము గెలుస్తాము" అని నెతన్యాహు రాశారు.



Tags

Read MoreRead Less
Next Story