Hostages Released: హమాస్ బందీలుగా ఉన్న నలుగురు ఇజ్రాయెల్ మహిళా సైనికులు విడుదల

గాజా స్ట్రిప్‌లో యుద్ధాన్ని ఆపేందుకు ఇజ్రాయెల్‌తో హమాస్ కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం, శనివారం నలుగురు ఇజ్రాయెల్ మహిళా సైనికులు విడుదల అయ్యారు. కరీనా అరివ్, డానియెలా గిల్బోవా, నామా లెవీ, లిరి అల్బాగ్ మహిళా సైనికులు విడుదల చేసారు. వీరిని మొదట గాజాలోని రెడ్ క్రాస్ కు అప్పగించారు. ఈ విడుదల కార్యక్రమం సందర్భంగా, మహిళా సైనికులను ప్రత్యేక వాహనాలలో వేదికపైకి తీసుకువచ్చారు. అక్కడ వారి కుటుంబ సభ్యులతో క్షేమంగా కలుసుకున్నారు. ఈ మహిళా సైనికులు అక్టోబర్ 7 న హమాస్ దాడి సమయంలో ఇజ్రాయెల్ సైనిక స్థావరం నహాల్ ఓజ్ నుంచి అపహరించబడ్డారు. 477 రోజుల కాలంలో వారు గాజా నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లోకి తీసుకెళ్లబడ్డారని, సూర్యరశ్మి కూడా లేని చోట తమని ఉంచారని తెలిపారు.
విడుదలైన ఇజ్రాయెల్ మహిళా సైనికులు, వారి బందీ జీవితాన్ని వివరించారు. తమకు సరైన ఆహారం, నీరు లేకపోవడంతో మరుగుదొడ్లను శుభ్రం చేయడం, ఉగ్రవాదులకు ఆహారం తయారు చేయడం వంటి కష్టాలు ఎదురయ్యాయని చెప్పారు. పలుమార్లు ఏడవడానికి కూడా అవకాశం ఇవ్వలేదని తెలిపారు. గాయపడిన తమని చిత్రహింసలకు గురి చేసారని కూడా వారు తెలిపారు. ఇక, హమాస్ వారు బందీలుగా ఉన్న సమయంలో ఎక్కువ కాలం చీకటిలో గడిపినట్లు చెప్పారు.
వారిలో కొంతమంది సైనికులకు బందీగా ఉండేటప్పుడు నిత్యం శారీరక మానసికంగా వేధింపులకు గురయ్యారని, అయితే ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని ఈ కష్టాలను ఎదుర్కొని పటిష్టంగా నిలబడినట్లు చెప్పారు. ఈ అనుభవం వారికి జీవితాంతం మరచిపోలేని జ్ఞాపకమని తెలిపారు. చాలాసార్లు వారిలో కొందరు ఉగ్రవాదులకు ఆహారం వండాల్సి వచ్చింది. దీంతో పాటు మరుగుదొడ్లను శుభ్రం చేయాలన్నారు. ఇంత చేసిన తర్వాత ఆహారం కోసం అడిగితే నిరాకరించారని, ఇప్పటి వరకు తమ జీవితంలో ఇదే అత్యంత భయంకరమైన సమయం అని సైనికులు తెలిపారు. మేము ఒకరికొకరు ధైర్యం చేసామని, అందుకే మేము ఈ రోజు వరకు జీవించామని చెప్పుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com