Roger Federer: టెన్నిస్ దిగ్గజానికి పుట్టినరోజు శుభాకాంక్షలు

Roger Federer: టెన్నిస్ దిగ్గజానికి పుట్టినరోజు శుభాకాంక్షలు
తన 42వ ఏట అడుగు పెడుతున్న ఫెదరర్

తన ఆటతో అంతకుముంచి తన మంచి మనసుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్. 24 ఏళ్ల పాటు టెన్నిస్ కోర్టును ఏలాడు రోజర్ ఫెదరర్. స్విట్జర్లాండ్ టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్ ఈరోజు తన 42వ ఏట అడుగుపెట్టాడు.

1998లో టెన్నిస్ క్రీడలోకి అడుగుపెట్టిన రోజర్ ఫెదరర్ తన 24 ఏళ్ల కెరీర్లో ఎన్నో మైలురాళ్లు అందుకున్నారు. 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్, ఎనిమిది వింబుల్డన్ ట్రోఫీలు, ఆరుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్, ఐదుసార్లు యూఎస్ ఓపెన్ , ఒక ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు సాధించారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ డబుల్స్ విభాగంలో స్వర్ణం, 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్ సింగిల్స్ విభాగంలో రజత పతకం అందుకున్నాడు.


తన 24 ఏళ్ల కెరీర్.. 24 గంటల్లా గడిచిపోయాయని చెప్పే కెరీర్లో దాదాపు 1,500కు పైగా అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు. ఫెదరర్ ర్యాంకింగ్స్‌లో కూడా సత్తా చాటాడు. 310 వారాలపాటు నెంబర్ 1 ర్యాంకులో కొనసాగాడు. 1998లో ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్‌గా మారిన అనంతరం కెరీర్‌లో మొత్తం 1526 సింగిల్స్ మ్యాచ్‌లు ఆడిన ఫెదరర్.. వీటిలో 1251 మ్యాచుల్లో గెలిచాడు. అలాగే 103 సింగిల్స్ టైటిళ్లు సాధించాడు. వీటి ద్వారా సుమారు 13 కోట్ల డాలర్లు సంపాదించాడు. ఫెదరర్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో పురుషుల డబుల్స్ ఈవెంట్‌లో రెండు ఒలింపిక్స్ పతకాలను సాధించాడు.

తరువాత రాను రాను గాయాలు ఫెదరర్ ఆటతీరుపై ప్రభావం చూపించాయి. శస్త్రచికిత్సల అనంతరం ఫెదరర్ పుంజుకోలేకపోయాడు. ఈ కారణాలతోనే గత ఏడాది లావర్ కప్ పోటీలో ఫెదరర్ తన రెండు దశాబ్దాల కెరీర్‌కు తెర దించాడు.ఫెదరర్ తన ఆదాయంలో కొంతభాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంటాడు. ఫెదరర్ విరాళాలతో ప్రపంచవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆటకు వీడ్కోలు చెప్పినా ఈ టెన్నిస్‌ దిగ్గజం అందరి మనస్సులోనూ నిలిచిపోయాడు.

Tags

Read MoreRead Less
Next Story