PRINCE: బ్రిటన్‌లో సొంత ఇల్లు కూడా లేని ప్రిన్స్‌ హ్యారీ

PRINCE: బ్రిటన్‌లో సొంత ఇల్లు కూడా లేని ప్రిన్స్‌ హ్యారీ
ఫ్రాగ్‌మోర్‌ కాటేజ్‌ను ఖాళీ చేసిన ప్రిన్స్‌ హ్యారీ దంపతులు... కింగ్‌ ఛార్లెస్‌కు తాళాలు అప్పగింత... బ్రిటన్‌లో సొంత ఇల్లు కూడా లేని ప్రిన్స్‌గా హ్యారీ...

ప్రేమ, వివాహ బంధం కోసం రాచరికాన్ని వదులుకున్న ప్రిన్స్‌ హ్యారీ దంపతులు బ్రిటన్‌లో రాజ కుటుంబం ఇల్లుగా భావించే విండ్సర్ ఎస్టేట్‌లోనిఫ్రాగ్‌మోర్‌ కాటేజ్‌ను ఖాళీ చేశారు. ఎవిక్షన్ నోటీసు ఇచ్చిన ఆరు నెలల తర్వాత ఇంటి తాళాలను కింగ్‌ ఛార్లెస్‌కు అందజేశారు. ఆస్తుల పంపక గడువు కంటే ముందే హ్యారీ దంపతులు ప్రాగ్‌మోర్‌ను ఖాళీ చేయడంతో ఇక ఈ విలాసవంతమైన ఇంటిని అద్దెకు ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెలలో ఫోన్ హ్యాకింగ్ కేసులో విచారణలో సాక్షిగా కోర్టులో హాజరైనప్పుడు హ్యారీ ఇక్కడే బస చేశారు. ఫ్రాగ్మోర్‌ను ఖాళీ చేయడంతో బ్రిటన్‌లో ఈ రాజకుమారుడికి సొంత ఇల్లు అంటూ లేకుండా పోయింది. ఇకపై హ్యారీ ఇంగ్లండ్‌లో పర్యటిస్తే హోటల్లో, స్నేహితుల ఇళ్లలోనే ఉండాల్సి రావచ్చు.


హ్యారీ, మేఘన్‌ దంపతుల వివాహ సమయంలో 2018లో దివంగత క్వీన్ ఎలిజబెత్ II ఫ్రాగ్మోర్‌ కాటేజ్‌ను కానుకగా అందజేశారు. ఆ సమయంలో దీనిని 2.9 మిలియన్ డాలర్ల ఖర్చుతో మరమ్మతులు చేశారు. ఆస్తుల పంపంకాల్లో భాగంగా ప్రిన్స్‌ హ్యారీ సోదరుడు ప్రిన్స్ ఆండ్రూకు ఈ భవనం దక్కినట్లు తెలుస్తోంది. డచెస్ ఆఫ్ సస్సెక్స్ ఫ్రాగ్‌మోర్ కాటేజీని ఖాళీ చేశారని నిర్ధారిస్తున్నామని బంకింగ్‌హామ్ ప్యాలెస్‌ ప్రతినిధి వెల్లడించారు. హ్యారీ పుస్తకం స్పేర్‌ అందుబాటులోకి వచ్చిన మరుసటి రోజైన జనవరి 11నే తొలగింపు ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. బ్రిటీష్ రాజకుటుంబానికి చెందిన విండ్సర్ ఎస్టేట్‌లో నిర్మించిన ఫ్రాగ్‌మోర్ కాటేజ్ విలాసవంతమైన భవనంగా ఖ్యాతి గడించింది.


రెండేళ్ల క్రితం ప్రిన్స్‌ హ్యారీ, మేఘన్‌ మార్కెల్‌ను రాచరిక హోదాను వదులుకున్నారు. అప్పట్నుంచి రాజకుంటుంబానికి దూరంగా అమెరికాలోని కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్నారు. ప్రిన్స్‌ హ్యారీ స్పేర్‌ పేరుతో తన జీవిత చరిత్రను రాశారు. ఇందులో రాజకుటుంబంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, అవమానాలు బయటపెట్టారు. తన తండ్రి కింగ్‌ ఛార్లెస్‌, సవతి తల్లి కెమిల్లా, అన్నయ ప్రిన్స్ విలియం గురించి సంచలన విషయాలు వెల్లడించారు. ఈ పుస్తకం విడుదలైన తర్వాత రాచకుటుంబంతో హ్యారీ సంబంధాలు దారుణగా దెబ్బతిన్నాయి. కానీ ప్రిన్స్‌ హ్యారీ-మేఘన్‌ దంపతులు రాజరికాన్ని వదులుకున్నా వారి పిల్లల్ని మాత్రం రాజకుంటుంబ సంప్రదాయాలతోనే పెంచుతామని బంకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ ప్రకటించింది. బ్రిటన్‌ రాజకుటుంబం నిబంధనల ప్రకారం చక్రవర్తి మనుమడు, మనుమరాలు.. యువరాణి, యువరాజు కావచ్చు. దాని ప్రకారమే ప్రిన్స్ హ్యారీ, మేఘన్‌ రాజకుటుంబ హోదా వదులుకున్నప్పటికీ.. వారి పిల్లలకు రాచరిక హోదా కల్పించారు.

Tags

Read MoreRead Less
Next Story