Reverses Ageing Cocktail : ఇక ముసలితనమే రాదు... నిత్య యవ్వనమే

Reverses Ageing Cocktail : ఇక ముసలితనమే రాదు... నిత్య యవ్వనమే
వృద్ధాప్యం రాకుండా ఉండేందుకు చేస్తున్న ప్రయోగాల్లో కీలక ముందడుగు.... వయసు తగ్గించే కెమికల్‌ కాక్‌టెయిల్‌ను అభివృద్ధి చేసిన హార్వర్డ్‌ శాస్త్రవేత్తలు.

వీడు ముసలోడు అవ్వకూడదే.... ఉప్పెన సినిమాలో కృతి శెట్టి చెప్పిన డైలాగ్ ఇది. నిజంగానే వృద్ధాప్యం రాకుండా ఉండేందుకు పరిశోధకులు చేస్తున్న ప్రయోగాల్లో(Researchers) కీలక ముందడుగు పడింది. ఇది మరింత విజయవంతమైతే వయసు పెరిగినా ముఖంపై ముడతలు, ఒళ్లు వంగిపోవడం వంటి సమస్యలే ఉండవు. అంటే ముసలితనం మన దగ్గరికే రాదు. దానికోసమే హార్వర్డ్‌ సైంటిస్టులు(Harvard scientists) కాక్‌టెయిల్‌ డ్రగ్‌ను కనిపెట్టారు.


మనుషుల్లో వయసు పెరిగే కొద్దీ చర్మం ముడతులు పడడం, సత్తువ తగ్గడం, ఒళ్లు వంగిపోవడం వంటివి సహజంగా వస్తుంటాయి. వయసుతోపాటు శరీరంలో వృద్ధాప్య(OLD AGE) ఛాయలు కనిపిస్తాయి. అయితే.. వయసు పెరిగినా శరీరం నిత్య యవ్వనంలా కనిపించేందుకు శాస్త్రవేత్తలు చాలాకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ ప్రయోగాల్లో హార్వర్డ్‌ శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. వయసును తగ్గించే కెమికల్‌ కాక్‌టెయిల్‌(cocktail of drugs)ను అభివృద్ధి చేశామని ప్రకటించారు. దీనికి సంబంధించిన అధ్యయన వివరాలను ఈ నెల 12వ తేదీన ఏజింగ్‌ జర్నల్‌లో ప్రచురించారు.


చాలామంది వయసు పెరిగే సమయంలో కూడా ఫిట్‌గా యవ్వనంగా ఉండాలనే రకరకాల డైట్‌ ఫాలో అవుతుంటారు. అయినా వృద్ధాప్య ఛాయాలు కనిపిస్తునే ఉంటాయి. దానికి చెక్‌పెట్టి మనం ఎప్పటికీ యవ్వనంగా ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


ఈ కాక్‌టెయిల్‌ రసాయనాన్ని ఎలుకల(RATS)పై ప్రయోగించగా సత్ఫలితాలనిచ్చింది. వారి ఏజ్‌ని చాలా ఏళ్లు వెనక్కి( reverse aging) నెట్టినట్లు నిర్థారించారు. తాము ఈ పరిశోధనలను రసాయన ప్రేరిత రీ ప్రోగ్రామింగ్‌ టు రివర్స్‌ సెల్యులర్‌ ఏజింగ్‌" అనే పేరుతో చేసినట్లు తెలిపారు ఈ మేరకు హార్వర్డ్‌ పరిశోధకుడు డేవిడ్‌ సింక్లైర్‌( Harvard researcher David Sinclair) జూలె12న ప్రచురితమైన జర్నల్ ఏజింగ్‌లో ఈ విషయాన్ని పేర్కొన్నాడు. జన్యు చికిత్స ద్వారా రివర్సల్‌ ఏజింగ్‌ సాధ్యమవుతుందని భావించామని.... ఇప్పుడూ ఈ కెమికల్‌ కాక్‌టెయిల్స్‌తో అది సాధ్యమని నిరూపించామని ఆయన ప్రకటించారు. ఇది నిజంగా మనిషిని పూర్తి యవ్వనవంతుడిగా మార్చే ఒక గొప్ప ముందడగని వెల్లడించారు.


ఈ రసాయన కాక్‌టెయిల్‌లో ఐదు నుంచి ఏడు ఏజెంట్లు ఉంటాయని, వీటిలో చాలా వరకు శారీరక, మానసిక రుగ్మతలకు చికిత్స అందిస్తాయని చెప్పారు. తమ బృందం సెల్యూలర్‌ వృద్ధాప్యాన్ని తిప్పికొట్టేలా మానవ కణాలను పునరుజ్జీవింప చేయడానికి మిళితం చేయగల అణువులను కనుగొనడానికి మూడు ఏళ్లు పైగా కృషి చేసిందని ఆయన వెల్లడించారు.ఈ పరిశోధనల్లో.. ఆప్టిక్‌ నరాలు, మెదడు, కణజాలం, మూత్రపిండాలు, కండారాలు తదితరాలపై అధ్యయనాలు మెరుగైన ఫలితాలను ఇచ్చాయని తెలిపారు.

ఎలుకలపై చేసిన పరిశోధనల్లో..వాటి జీవితకాలం పొడిగించబడటమేగాక మంచి ఫలితాలు కనిపించాయన్నారు. అలాగే కోతుల(monkeys) పై చేసిన పరిశోధనల్లో కూడా మెరుగైన ఫలితాలు వచ్చాయని తెలిపారు. ఇక మిగిలింది మానవులపై చేయాల్సిన పూర్తి స్తాయి క్లినికల్‌ ట్రయల్స్‌ అని పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలో అవి కూడా ప్రారంభకానున్నాయని చెప్పారు. అంతా సవ్యంగానే జరగుతుందని, మంచి ఫలితాలే వస్తాయని హార్వర్డ్‌ శాస్త్రవేత్త సింక్లైర్‌ ధీమగా చెబతున్నారు

Tags

Read MoreRead Less
Next Story